రామ్ చరణ్ రాయబారం: విడిపోయిన ఇద్దరూ కలిసారు
హైదరాబాద్: ఆ మధ్యన విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్, దర్శకుడు శ్రీనువైట్లకి ఈ మధ్య ఓ కోల్డ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఒకరినొకరు తీవ్రంగా తిట్టుకుని మీడియా కెక్కిన వీరిద్దరు మళ్లీ కలిసి సినిమా తీస్తున్నారనే విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాకుండా ఒకరిపై ఒకరు ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు..దీంతో అసలు వీరిద్దరు మాట్లాడుకోరు, శ్రీను సినిమాలో ప్రకాష్ ఇక కనిపించే అవకాశం లేదనుకున్నారు అంతా.
https://www.facebook.com/TeluguFilmibeat
కానీ ప్రస్తుతం సీన్ మారింది.ప్రస్తుతం శ్రీనువైట్ల రామ్‌చరణ్ కాంబినేషన్‌లో సినిమా చేయడానికి స్ర్కిప్ట్ వర్క్ సిద్ధమైంది. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌కు సరబడేక్యారెక్టర్ ఉండటంతో.. ప్రకాష్‌తోనే ఆ పాత్ర చేయించడానికి రామ్ చరణ్ పట్టుబట్టారని సమాచారం. దీంతో స్వయంగా చరణే రంగంలోకి దిగి వీళ్లమధ్య గొడవను సద్దుమణిగేలా చేశారని తెలుస్తోంది. దీంతో ప్రకాష్‌రాజ్ కూడా వైట్ల దర్శకత్వంలో నటించడానికి నాకు ఎటువంటి అభ్యతరం లేదని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఫిలింనగర్ వర్గాల నుండి సమాచారం. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని ‘మన భారతంలో పాండవులు, కౌరవులు రాజాలు రా' అనే సాంగ్ నుండి ఈ మూవీ టైటిల్ స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ పరిశీలిస్తారా? అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ చిత్రం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.


Click it and Unblock the Notifications











