ప్రభు, నయన పెళ్లికి ప్రకాష్ రాజ్ పౌరోహిత్యం..!
ప్రభుదేవాను పెళ్ళి చేసుకోనే విషయంలో నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేమిద్దరం ఫ్రీ బర్డ్స్. ప్రభుని పెళ్ళాడేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికీ చెప్పకుండా పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు" ఇది తమ పెళ్ళి పుకార్లపై నయనతార స్పందన. ముంబైలో రహస్యంగా నయనతార, ప్రభుదేవా పెళ్ళి చేసుకున్నారని వస్తోన్న వార్తలపై నయనతార పై విధంగా స్పందించింది. అంతేకాదు రహస్యంగా పెళ్ళి చేసుకోవాల్సినంత దుస్థితిలో మేమిద్దరం లేమని, అందరికీ తెలిసేలా, స్నేహితులను, బంధువుల సమక్షంలో ఘనంగా, అంగరంగ వైభవంగా తమ పెళ్ళి జరుగుతుందని అని చెబుతోంది నయనతార.
సినిమా ఇండస్ట్రీలో మరెవ్వరి గురించీ రానన్ని గాసిప్స్ ప్రభుదేవా, నయనతారల పెళ్లి గురించి వచ్చాయి... వస్తూనే వున్నాయి కూడా. వాళ్లిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నారంటూ ఇటీవలే ఓ గాసిప్ రావడం... ప్రభు దానిని ఖండించడం జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో వార్త షికారు చేస్తోంది. వచ్చే అక్టోబర్ నెలలో జరుగనున్న వీరి పెళ్లి బాధ్యతల్ని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తీసుకున్నాడట. ముంబైలో వివాహం, రిసెప్షన్ పనులను ఏ లోటూ రాకుండా నిర్వహించడానికి ప్రకాష్ రాజ్ ప్లాన్ చేస్తున్నాడట. అందుకు తగ్గట్టుగా తన షూటింగ్ ను ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ మొదటి నుంచీ కూడా ఈ జంటకు అన్ని విధాలా సహాయం చేస్తూనే వున్నాడు. వీరు ప్రేమలో పడిన తొలి రోజుల్లో ఓసారి వీరిద్దరూ ప్రకాష్ రాజ్ ఇంట్లో కొన్నాళ్ల పాటు విడిది తీసుకున్నారు కూడా!


Click it and Unblock the Notifications











