twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రకాష్ రాజ్ భార్యకు అన్యాయం

    By Staff
    |

    Prakash Raj
    విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఉమనైజర్ అని అందుకే విడాకులు కోరుతున్నాడనే వార్తలు చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ వినపడుతోంది. ప్రకాష్ రాజ్ తను ప్రేమించి పెళ్ళి చేసుకున్న లలిత కుమారికి పొసగటం లేదని విడాకులు కోరుతూ ఆ మధ్య చెన్నై ఎగ్మూరు కోర్టును ఆశ్రయించారు. అయితే ప్రకాష్ రాజ్‌కు ఆయన పర్సనల్ సెక్రటరీ బోనీ వర్మను ముడిపడుతూ వార్తలు వచ్చాయి. దీంతో ఆమెను పెళ్లి చేసుకొనేందుకే ప్రకాష్ రాజ్ తన భార్య లలిత కుమారి నుంచి విడాకులు కోరుతున్నట్టు చెప్తున్నారు. అయితే ఈ కథనాలను ప్రకాష్ రాజ్ తోసిపుచ్చాడు. పర్శనల్ కారణాలే తమ విడాకులుకు కారణం అని తేల్చి చెప్పారు. అలాగే తన కుమార్తె పూజను తన కస్టడీకే పంపాలని కోర్టును కోరారు.

    అయితే లలితకుమారి ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయనలేదు. వారిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ఇరు కుటుంబీకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్-లలిత కుమారిలతో ప్రేమ వివాదం. 1993లో వారద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. లలిత కుమారి గ్లామరస్ నటి 'డిస్కో' శాంతికి స్వయాన చెల్లెలు. ఇక ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో ప్లే బోయ్ అని అందుకే భార్యను ఎంతో కొంత భరణం ఇచ్చి వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటున్నారు. అయితే లలిత కుమారి మాత్రం తన భర్తకు విడాకులు ఇవ్వటానికి ఆసక్తి చూపటం లేదని, అలాగే కాంపన్సేషన్ గా ఇచ్చే డబ్బు మీద కూడా ఇంట్రస్టు చూపటం లేదని వినపడుతోంది. తన భర్త, తన పిల్లలుతో కలిసి ఉండటమే మంచిదని ఆమె భావిస్తోదంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X