హాట్ టాపిక్ : 'అత్తారింటికి దారేది' పంక్షన్ లో ఆమె ఏది?
హైదరాబాద్ : శుక్రవారం రాత్రి పవన్ కల్యాణ్ సినిమా 'అత్తారింటికి దారేది' ఆడియో వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో రెండో హీరోయిన్ గా చేస్తున్న ప్రణీత కనిపించలేదు. ఆమె పేరు కూడా ఎక్కడా వినిపించలేదు. కావాలని ఎవాయిడ్ చేసారా..లేక ఆమె బిజీగా ఉండి రాలేకపోయిందా అనే టాపిక్ ఇప్పుడు హాట్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో మారింది.
దానికి తోడు...పవన్ కళ్యాణ్ తప్ప ఈ ఆడియో పంక్షన్ కి మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరో ఎవరూ రాలేదు. అయినా గాభిమానులెవరూ చిరంజీవి కోసం కానీ, రామ్‌చరణ్ లేదా అల్లు అర్జున్ కోసం కానీ గోలపెట్టలేదు. ఇక్కడా పవర్‌స్టార్ హవానే. ఈ సంఘటనతో మెగా ఫ్యాన్స్ కల్యాణ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని విశ్లేషకులు అంటున్నారంటూ ప్రముఖ దిన పత్రికలో కథనాలు మొదలయ్యాయి.
ఓ తెలుగు దిన పత్రిక కథనం ఇలా సాగింది....మెగా ఫ్యామిలీకి సంబంధించి కనిపిస్తున్న ఒక అంశం సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. చాలా మంది దీని గురించి చర్చించుకోవడం కనిపిస్తోంది కూడా. ఇటీవలి కాలంలో జరిగిన మెగా కుటుంబపు సినిమాల వేడుకలు వార్తల్లో నిలిచాయి. రామ్‌చరణ్ సినిమా ఆడియో వేడుక కానీ, లేదా అల్లు అర్జున్ ఆడియో వేడుక కానీ ఒక వ్యక్తి గురించి మెగా ఫ్యాన్స్ కేకలు, అరుపులు పెడుతూ వస్తున్నారు. ఆ వ్యక్తి పవన్ కల్యాణ్.
ఆ వేడుకల్లో అభిమానుల నుంచి వచ్చే ఒకే ఒక్క మాట 'వుయ్ వాంట్ పవర్‌స్టార్'. సాధారణంగా వేడుకలకు పవన్ కల్యాణ్ దూరం. ఎప్పుడో కానీ ఆయన ఆడియో వేడుకలకు హాజరు కావడం లేదు. రామ్‌చరణ్ 'రచ్చ' ఆడియో వేడుకకు ఆయన రాకపోవడంతో అభిమానులు గోల చేశారు. జనాలతో పాటు అతిథులపైనా వాటర్ బాటిళ్లు విసిరేశారు.
అప్పుడు కల్యాణ్ విదేశాల్లో ఉండి రాలేకపోయాడంటూ అభిమానుల్ని శాంతిపజేసే ప్రయత్నం చేశారు చిరంజీవి. ఆ తర్వాత రామ్‌చరణ్ మరో సినిమా 'నాయక్' ఆడియో వేడుకకు కల్యాణ్ హాజరయ్యారు. అప్పుడు కూడా రామ్‌చరణ్ కంటే కల్యాణ్ పట్లే అభిమానులు ఎక్కువ ఆసక్తి కనపర్చడం, ఆయన మాట్లాడాలని గోల పెట్టడం స్పష్టంగా కనిపించింది.
ఇటీవలే రామ్‌చరణ్ తాజా చిత్రం 'ఎవడు' ఆడియో వేడుకలో కల్యాణ్ పాల్గొనకపోయే సరికి చిరంజీవి సమక్షంలోనే అభిమానులు 'వుయ్ వాంట్ పవర్‌స్టార్' అంటూ గోల చేయడంతో పవన్‌కల్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా షూటింగ్ కోసం ఫారిన్‌లో ఉన్నాడనీ, 'ఎవడు' జూబ్లీ ఫంక్షన్‌కి తప్పకుండా హాజరవుతాడనీ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అంటూ రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











