'గబ్బర్‌సింగ్-2' లో హీరోయిన్ గా మళ్లీ ఆమెనే ?

By Srikanya

హైదరాబాద్ : అత్తారింటికి దారేది చిత్రంలో మంచి ఊపు మీద ఉన్న పవన్‌కల్యాణ్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ' గబ్బర్‌సింగ్-2' పనులు వేగవంతం చేసారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రణీతని ఎంపిక చేసే అవకాసమున్నట్లు సమాచారం. పవన్ తాజా చిత్రం అత్తారింటికి దారేదీలో ప్రణీత ఓ హీరోయిన్ గా చేసింది. తెలుగు అమ్మాయి కావాలన్న పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆమెను సంపత్ నంది ప్రపోజ్ చేసినట్లు చెప్తున్నారు. పవన్ కూడా ఈ ప్రపోజల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాసం ఉందంటున్నారు.

నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో దీపికా పదుకోని నటించే అవకాసం ఉందని కొంత ప్రచారం జరిగింది. ఈ నెలాఖరు నుంచి చిత్రీకరణ జరగనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక వేగ వంతంగా జరుగుతోంది. ఇంతకుముందు సోనాక్షి సిన్హా, కాజల్ అగర్వాల్ అనుకున్నప్పటికీ వారిద్దరికీ డేట్స్ ప్రాబ్లమ్ తో తప్పుకున్నట్లు చెప్తున్నారు.

హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్'కు ఇది ప్రాంచైజీ ఫిల్మ్. ఈచిత్రం సీక్వెల్,ప్రీ క్వెల్ కాదనీ ప్రాచైజీ గా ఫ్రెష్ స్టోరీ తో వచ్చే చిత్రం అని సంపత్ నంది చెప్తున్నారు. అలాగే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే చెప్తామన్నారు. స్క్రిప్టు వర్క్ పూర్తై మిగతా పనులు వేగంగా జరుపుతున్నట్లు సమాచారం.

నిజానికి 'గబ్బర్‌సింగ్' హిందీలో సల్మాన్‌ఖాన్ నటించిన సూపర్‌హిట్ ఫిల్మ్ 'దబాంగ్'కు రీమేక్ అనే సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వచ్చిన 'దబాంగ్-2' సైతం ఘన విజయం సాధించింది. అయితే 'గబ్బర్‌సింగ్-2' అనేది 'దబాంగ్-2'కు రీమేక్ కాదన్నది గమనార్హం. దర్శకుడు సంపత్ నంది తయారుచేసిన కథతో ఈ సినిమా రూపొందనున్నది. ఈ సినిమా కోసం పవన్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X