నిర్మాతకు అండగా యంగ్ హీరోయిన్.. సుహాస్ హీరోయిన్ ఏం చేసిందంటే?
కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ మోడల్ గా చేసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కన్నడలోనే కాకుండా తమిళ భాషలో కూడా పలు సినిమాల్లో నటించి, హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రసన్న వదనం అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

వై కే అర్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 3న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాతోనే హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే కొత్త హీరోయిన్లు సాధారణంగా నిర్మాతను ఇబ్బందికి గురిచేస్తారు. కానీ పాయల్ మాత్రం చాలా ప్రొఫెషనల్‌గా నిర్మాతకు సహరించిందనే విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











