కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్... ఎన్టీఆర్ మూవీతో టాలీవుడ్లోకి?
కెజిఎఫ్-చాప్టర్ 1 మూవీతో సంచలన విజయం నమోదు చేసిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓవర్‌నైట్ స్టార్ డైరెక్టర్ హోదా సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీలో కూడా భారీ విజయం అందుకోవడంతో ప్యాన్ ఇండియా లెవల్ మూవీ తీయగల దర్శకుడిగా కీర్తి గడించాడు. దీంతో అతడితో సినిమాలు చేయడానికి పలువురు తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
కెజిఎఫ్-చాప్టర్ 2 పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్... ప్రభాస్ లేదా మహేష్ బాబు సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ వారితో సినిమా చేయడానికి ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా సమాచారం ప్రకారం... ప్రశాంత్ నీల్ ఇతర హీరోలపై ఆసక్తి చూడం లేదని, ఎన్టీఆర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇదే విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారికి చెప్పారని, వారు ఎన్టీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ప్రశాంత్ నీల్ రాసుకున్న కథకు.... ఎన్టీఆర్ మేనరిజం, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అయితే బాగా సూటవుతుందట. మైత్రి మూమీ మేకర్స్ ఒక అవకాశం కల్పిస్తే యంగ్ టైగర్‌ను కలిసి స్టోరీ చెప్పేందుకు ప్రశాంత్ నీల్ సిద్ధంగా ఉన్నారట. అంతా సవ్యంగా జరిగితే కెజిఎఫ్-చాప్టర్ 2 ముగిసిన తర్వాత ఎన్టీఆర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











