Don't Miss!
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
‘అ’ దర్శకుడి చేతికి ‘క్వీన్’ తెలుగు రీమేక్?
Recommended Video
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో బాలీవుడ్లో తెరకెక్కిన 'క్వీన్' చిత్రం అక్కడ భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఈ హాట్ బ్యూటీ కెరీర్ మలుపు తిప్పిన చిత్రంగా నిలిచింది. త్వరలో ఈ మూవీ సౌత్ బాషల్లో రీమేక్ కాబోతోంది. తమన్నా ప్రధాన పాత్రలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో రీమేక్ చేయబోతున్నారు.
ఈ సినిమాకు దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే పలు కారణాలతో ఈ సినిమా ముందుకు సాగలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'అ' ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
'అ' సినిమా ద్వారా దర్శకుడు ప్రశాంత్ వర్మ స్టోరీ టెల్లింగ్ విషయంలో మంచి మార్కులు కొట్టేశాడు. 'క్వీన్' లాంటి సబ్జెక్టును అతడు బాగా హ్యాండిల్ చేయగలడన్న నమ్మకానికి వచ్చిన నిర్మాతలు త్వరలోనే ఈ విషయాన్ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట.
ఈ చిత్రాన్ని తమన్నా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం చేయడంపై ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే క్వీన్ తెలుగు రీమేక్ మన ముందుకు రాబోతోంది.