Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ప్రభాస్ విషయంలో ప్రశాంత్ నీల్ టెన్షన్.. ఆ పని చేసే దాకా నో షూట్ అంటూ?
బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఏ సినిమా చేసినా వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే బాహుబలి తర్వాత ఆయన చేసిన సాహో సినిమా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు సాధించి, ఎక్కడా నష్టాలు రాకుండా చేసింది. కానీ తాజాగా వచ్చిన రాధేశ్యామ్ సినిమా మాత్రం కలెక్షన్స్ విషయంలో కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ప్రస్తుతం అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తుండగా ప్రభాస్ వ్యవహారంతో ప్రశాంత్ నీల్ కాస్త టెన్షన్ ఫీల్ అవుతున్నాడు అని తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే

సలార్
బాహుబలి
అనే
ఒక
దృశ్య
కావ్యం
ఎంతగా
హిట్టయింది
అనేది
ప్రత్యేకంగా
చెప్పాల్సిన
అవసరం
లేదు.
ఆ
సినిమా
చేసిన
రాజమౌళికి
ఎంత
పేరు
వచ్చిందో
హీరోగా
నటించిన
ప్రభాస్
కి
కూడా
అంతే
పేరు
వచ్చింది.
ఈ
నేపథ్యంలోనే
ప్రభాస్
చేస్తున్న
ప్రతి
సినిమా
పాన్
ఇండియా
లెవల్లో
ఇండియాలో
విడుదలవుతోంది.
ఇప్పటికే
సినిమాలను
లైన్
లో
పెట్టిన
ప్రభాస్
ప్రస్తుతానికి
కేజిఎఫ్
సృష్టికర్త
ప్రశాంత్
నీల్
దర్శకత్వంలో
సలార్
అనే
సినిమా
చేస్తున్నాడు.
ఈ
సినిమాను
హోంబలే
ఫిలిమ్స్
బ్యానర్
మీద
విజయ్
కిరగందూర్
నిర్మిస్తున్నారు.

షూటింగ్ చేసేది లేదు
అయితే తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ప్రశాంత్ నీల్, ప్రభాస్ లుక్ విషయంలో ఏ మాత్రం సంతోషంగా లేదని తెలుస్తోంది. తాను అనుకున్న లుక్కు వేరని కానీ ప్రభాస్ ప్రస్తుతం ఉన్న లుక్కు వేరుగా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారట. మొహమాటానికి పోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని భావించి లుక్ మారే వరకు షూటింగ్ చేసేది లేదు అని ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ తేల్చి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

సన్నగా చూపించే ప్రయత్నం
నిజానికి ప్రభాస్ లుక్ విషయంలో కొద్ది రోజుల క్రితం ట్రోల్స్ కూడా నడిచిన సంగతి తెలిసిందే. ఆయన ముంబైలో కారులో వెళుతున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తియ్యగా ఆ లుక్ బయటకు వచ్చాక పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.. అయితే రాధేశ్యామ్ సినిమాలో మాత్రం ఆయన చాలా స్లిమ్ గా కనిపించాడు. ఈ మాయాజాలం ఏమిటో ప్రేక్షకులకు పెద్దగా అర్థం కాలేదు. అయితే ప్రభాస్ తో సినిమా చేస్తున్న వారు ఆయనను గ్రాఫిక్స్ లో సన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట.

షూటింగ్ లేదని చెప్పడంతో
అయితే పర్ఫెక్షన్ విషయంలో రాజమౌళికి ఏమాత్రం తీసిపోని ప్రశాంత్ తాను అలా చేయడానికి విరుద్ధం అని, మీరు పూర్తిగా సన్నబడిన తరువాతే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని ప్రభాస్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఎప్పటికి సన్నబడతాడో సినిమా ఎప్పటికి పూర్తవుతుందో అని ఆయన టెన్షన్ పడుతున్నాడని ప్రభాస్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడని సన్న బడే వరకు షూటింగ్ లేదని చెప్పడంతో ఆయన ఇప్పటికీ వర్కౌట్స్ ప్రారంభించాడని అంటున్నారు.

డైట్ ప్లానింగ్ తో
పర్ఫెక్ట్ డైట్ ప్లానింగ్ తో వీలైనంత త్వరగా బరువు తగ్గే విధంగా ప్రభాస్ ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ఫిలిం నగర్ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా కాకుండా మరిన్ని సినిమాలు లైన్ లో పెట్టారు. ప్రకటించిన సినిమాలు కాకుండా మారుతి దర్శకత్వంలో కూడా ఆయన ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.