Prashanth Neel భారీ మెగా ప్రాజెక్ట్.. రాంచరణ్, చిరంజీవితో మల్టీ స్టారర్! ఎప్పుడంటే?
కేజీఎఫ్, కేజీఎఫ్2 బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ హవా ఇండియన్ సినిమా పరిశ్రమలో జోరుగా కొనసాగుతున్నది. కేజీఎఫ్2 తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సలార్ టీజర్ ఇటీవల రిలీజై మంచి స్పందనను కూడగట్టుకొన్నది. అలాగే సలార్ పూర్తి చేసిన తర్వాత భారీ ప్రాజెక్టులపై కన్నేశాడు. అయితే మెగా హీరోలతో మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే..
అగ్ర హీరోలు, భారీ ప్రాజెక్టులతో ప్రశాంత్ నీల్ బీజీగా ఉన్నారు. ఒకవైపు ప్రభాస్‌తో సలార్, సలార్ 2 మూవీస్‌తో బిజీగా ఉంటూనే ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. అయితే ఈ మధ్యలో రాంచరణ్ ప్రాజెక్టు కూడా చేయబోతున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ప్రశాంత్ నీల్ సినిమాల లైనప్ క్రేజీగా మారింది. సలార్ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయడం గ్యారెంటీ. ఆ తర్వాత కేజీఎఫ్3 తోపాటు రాంచరణ్ సినిమా చేయాల్సి ఉంది. అయితే రాంచరణ్‌తో దాదాపు చర్చలు ముగిసాయి. అయితే ఈ సినిమాను మల్టీ స్టారర్‌గా మలిచే అవకాశం ఉందని తెలుస్తున్నది.
ఒకవేళ ప్రశాంత్ నీల్ కనుక రాంచరణ్‌తో మూవీ ప్లాన్ చేస్తే.. అందులో చిరంజీవి కూడా ఉంటారు. ఆ సినిమాను మల్టీ స్టారర్‌గా రూపొందించాలనే ఆలోచనకు వచ్చారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథపై కసరత్తు జరుగుతున్నది. అయితే ఈ ప్రాజెక్టు గురించిన చర్చలు ఫైనల్ కాలేదు. కానీ కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే చిరంజీవి, రాంచరణ్ హీరోలుగా రూపొందే మూవీ ఫ్రాంచైజీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక సినిమాతోనే కాకుండా సిరీస్‌గా రూపొందించే అవకాశాలపై ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలో ప్రశాంత్ నీల్ చెప్పిన రెండు, మూడు కాన్సెప్టులు రాంచరణ్‌కు నచ్చాయి. వాటిని డెవలప్ చేసే ఆలోచనలలో రాంచరణ్, ప్రశాంత్ నీల్ ఉన్నారని తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











