NTR31: ఎన్టీఆర్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్.. హాలీవుడ్‌లోకి తెలుగు హీరో.. ఇది మామూలు ప్లాన్ కాదుగా!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సింగింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అలా తన ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా క్రమంగా పెంచుకుంటూ దూసుకెళ్తోన్నాడు. ఇక, ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో భారీ సినిమాను చేయబోతున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

హిట్లు మీద హిట్ల కొడుతూ
చాలా కాలం పాటు హిట్లు పడక సతమతమైన ఎన్టీఆర్.. పూరీ జగన్నాథ్ తీసిన 'టెంపర్'తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. అప్పటి నుంచి తారక్ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు.

ఇంటర్నేషనల్ రేంజ్‌కూ
హిట్లు మీద హిట్లు కొడుతోన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అలాగే, తారక్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకొచ్చి అతడని పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది. అంతేకాదు, దీనితో అతడి రేంజ్ ఇంటర్నేషనల్ అయిపోయింది.

కొరటాలతో తారక్ మూవీ
ఎన్టీఆర్ RRR చేస్తున్నప్పుడే తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తి అయింది. ఈ చిత్రం షూటింగ్‌ను మార్చి చివర్లో మొదలు పెట్టబోతున్నారు.

ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్టు
RRR తర్వాత మరింత జోష్‌తో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. దీనిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

అప్పుడే ఈ సినిమా స్టార్ట్
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి మొదలు పెడతామని ప్రశాంత్ నీల్ గతంలోనే వెల్లడించాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను వచ్చే డిసెంబర్ నుంచి ప్రారంభించబోతున్నారట. అంతేకాదు, కేవలం ఒకే ఒక్క ఏడాదిలో పూర్తి చేసి 2024 డిసెంబర్‌లో దీన్ని విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

పాన్ వరల్డ్ రేంజ్‌లోనే
క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తారని ఇప్పటికే వెల్లడించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. అంటే.. ఏకకాలంలోనే దీన్ని ఇంగ్లీష్‌లోనూ విడుదల చేస్తారట. RRRతో ఎన్టీఆర్ రేంజ్ పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











