Dragon: డ్రాగన్‌లో 4 సర్‌ప్రైజ్‌లు.. ఎన్టీఆర్‌‌తో ప్రశాంత్‌ నీల్ భారీ స్కెచ్.. KGF, సలార్‌లను మించేలా!

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీ డ్రాగన్. కేజీఎఫ్ సిరీస్, సలార్ తర్వాత ప్రశాంత్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో పాటు ఎన్టీఆర్ హీరో కావడంతో డ్రాగన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. తాజాగా డ్రాగన్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

డ్రాగన్‌ కోసం వెయిట్ లాస్
వార్ 2 డిజాస్టర్ కావడంతో ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టి అభిమానులను అలరించాలని జూనియర్ ఎన్టీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. ఇందుకోసం తారక్ ఏకంగా 18 కిలోల బరువు తగ్గినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డ్రాగన్ కోసం స్టైలీష్‌గా, గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో కనిపించనున్నారని టాక్. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ ఏడాది జూన్ 25న డ్రాగన్ విడుదల కానుందని టాక్.

Prashanth Neel s Action Surprises in Dragon Jr NTR s Never-Before Stunts Set to Thrill Fans

ఎన్టీఆర్ సరసన రుక్మీణి వసంత్
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ, నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణలు భారీ బడ్జెట్‌తో డ్రాగన్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాంతార ఫేమ్ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్ తదితరులు ఈ సినిబమాలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రణవ్ శ్రీ ప్రసాద్‌ ఎడిటింగ్ చేస్తున్నారు.

రెండు పార్ట్స్‌గా డ్రాగన్?
మరోవైపు... డ్రాగన్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని మొదట నిర్మాతలు భావించారట. అయితే చివరి నిమిషంలో అది ఒకే భాగంగా మారిందని ఫిలింనగర్ టాక్. కథలో ఉన్న కంటెంట్, డ్రామాను దృష్టిలో ఉంచుకుని రెండు భాగాలుగా తీసినప్పటికీ సినిమాకు ఎలాంటి నష్టం ఉండదని యూనిట్ భావిస్తోంది. అటు సినిమాను సీక్వెన్స్‌లను తెరకెక్కించడంలో ప్రశాంత్ నీల్‌ ఎక్స్‌పర్ట్. ఆయన దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కించి సక్సెస్ కొట్టారు. సలార్‌ను ఒక భాగంగా తీయగా.. సెకండ్ పార్ట్‌ని తీసేందుకు ప్రశాంత్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో సలార్ 2 ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టినట్లుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్ అభిమానులకు సర్‌ప్రైజ్
ఇదిలాఉండగా.. ప్రశాంత్ నీల్ అంటే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లకు పెట్టింది పేరు. కేజీఎఫ్ సిరీస్, సలార్ సినిమాలు ఈ స్థాయిలో విజయం సాధించడానికి ఈ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతారు. వీటికి థియేటర్స్‌లో మాస్ నుంచి భారీ స్పందన లభించింది. ఈ క్రమంలోనే డ్రాగన్‌ విషయంలోనూ ప్రశాంత్ నీల్ సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ గతంలో ఎన్నడూ చేయని సాహసాలు, స్టంట్స్ ఈ సినిమాలో చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అభిమానుల కోసం నాలుగు సర్‌ప్రైజ్‌లను రెడీ చేసే పనిలో ప్రశాంత్ ఉన్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. డ్రాగన్‌లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌లో కనిపించడంతో పాటు స్టైల్‌గా సిగరెట్ తాగే సీన్, షర్ట్ లేకుండా ఊచకోత కోసే సీన్ అదిరిపోతుందని అంటున్నారు. అన్నింటికి మించి ఓ పోర్ట్‌లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని ఫిలింనగర్ టాక్. ఇవన్నీ ఎన్టీఆర్ అభిమానులకు విందు భోజనం అందిస్తాయని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: prashanth neel dragon jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X