HanuMan 2: జై హనుమాన్ పనులు మొదలు.. మెగా ప్రెజెన్స్‌తో సెకండ్ పార్ట్?

హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమా అని ముందు నుంచి అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తూ మరిన్ని కలెక్షన్లు రాబట్టే దిశగా ముందుకు వెళుతోంది. నిజానికి ఈ సినిమా అనేక రికార్డులు కూడా బద్దలు కొట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండో భాగం పేరు జై హనుమాన్ కాగా ఆ సినిమాలో హనుమంతుడిగా నటించేది ఎవరు అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. ఆ వివరాలు లోకి వెళ్తే...

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఆయనకు ఇది నిర్మాతగా మొదటి సినిమా అయినా ఎక్కడ వెనక్కి తగ్గకుండా నిర్మించారు.

Prashanth Varma Teja Sajja Jai HanuMan Start and Second Part With Mega Presence?

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా చివరిలో రెండో భాగంగా జై హనుమాన్ సినిమా తెరకెక్కుతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ రెండో సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా నిన్ననే మొదలుపెట్టినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.

అయితే ఇప్పుడు ఈ రెండో సినిమాలో హనుమాన్ గా ఎవరు నటిస్తారనే విషయం ఏదో చర్చ జరుగుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో హనుమంతుడి పాత్రలో ఒక స్టార్ హీరో నటించబోతున్నారు అని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయం ఇప్పుడే చెప్పను కానీ ఒక మంచి స్టార్ హీరోని ఈ పాత్ర కోసం తీసుకున్నామని ఖచ్చితంగా ఆ పేరు విన్న తర్వాత మీరందరూ ఆనందిస్తారు అని అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేశారు.

Prashanth Varma Teja Sajja Jai HanuMan Start and Second Part With Mega Presence?

అయితే ఆ రెండో భాగంలో నటించే ఆంజనేయుడు ఇంకెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి అనే చర్చ జరుగుతోంది. నిజానికి సినిమా రిలీజ్ అయిన కొత్తలో హనుమంతుడి పాత్రలో నటించేది వరుణ్ తేజ్ అని ప్రచారం జరిగింది. ఎందుకంటే గ్రాఫిక్స్ లో క్రియేట్ చేసిన హనుమంతుడి రూపంలో కాస్త వరుణ్ తేజ్ పోలికలు కనిపిస్తూ ఉండడంతో ఇంకేముంది వరుణ్ తేజ్ ఆ పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం జరిగింది.

ఆ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్నాడని అన్నారు కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడని వార్తలు తెరమీదకి వస్తున్నాయి. నిజానికి ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ కన్ఫామ్ చేయలేదు కానీ మెగాస్టార్ లేదా మెగాస్టార్ కుటుంబం నుంచి ఎవరైనా ఆ పాత్రలో నటిస్తే ఆ రెండో భాగానికి ఒక రేంజ్ లో వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చూడాలి ఎవరు ఆ పాత్రలో నటిస్తారు అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X