'అ' డైరెక్టర్‌తో బాలకృష్ణ మూవీ కన్ఫర్మ్!
టాలీవుడ్ చిత్రసీమలో ఎంతమంది హీరోలున్నా అందరిలో కెల్లా నందమూరి బాలకృష్ణ తీరే వేరు. దశాబ్దాల కాలంగా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి క్లాస్, మాస్ ఆడియన్స్ గుండెల్లో తిష్ట వేశారు బాలయ్యబాబు. కుర్ర హీరోలు వచ్చాక కూడా బాలయ్య బాబు క్రేజ్ ఏ మాత్రం తగ్గక పోవడం విశేషం. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు బాలకృష్ణ.
గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో సెంచరీ కొట్టేసిన ఈ వెటరన్ హీరో ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో బాలయ్య బాబు క్రియాశీలంగా పాల్గొనడం కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి దసరా కల్లా ఈ సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇదిలా ఉంటే కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా పూర్తికాగానే బాలయ్య బాబు చేయబోయే సినిమాపై ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. 'అ' డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య తదుపరి సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రశాంత్ వర్మ.. బాలయ్యను త్వరలోనే సంప్రదించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే వీరిద్దరి నుంచి మునుపెన్నడూ చూడని డిఫరెంట్ మూవీ వస్తుందనటంతో అతిశయోక్తి లేదు.
మరోవైపు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా 'కల్కి' ఈ రోజే (జూన్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ హీరోగా నటించగా ఆయన సరసన అదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటించారు. ఇప్పటివరకైతే ఈ సినిమాపై పాజిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











