YS Jagan Biopic ప్లాన్ రెడీ: ఏపీ సీఎం పాత్రలో ఆ యంగ్ హీరో.. సినిమా మొత్తం కథ ఇదే!

కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ మూవీల హవా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ల జీవిత కథలను సినిమాలుగా మలిచారు మన ఫిల్మ్ మేకర్స్. వీటిలో చాలా వరకూ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఫలితంగా ఈ క్రమంలోనే మరికొంత మంది లెజెండ్‌ల కథలతో ప్రాజెక్టులను రెడీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బయోపిక్ కూడా పట్టాలెక్కబోతుంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

వైఎస్సార్ బయోపిక్‌తో వచ్చిన మహి

వైఎస్సార్ బయోపిక్‌తో వచ్చిన మహి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'యాత్ర'. మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రను పోషించారు. కొన్నేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పట్లో ఈ దర్శకుడి టేకింగ్‌పై ప్రశంసలు కూడా దక్కిన విషయం తెలిసిందే.

జగన్ ఫ్యాన్స్ రిక్వెస్ట్.. సీక్వెల్ అంటూ

జగన్ ఫ్యాన్స్ రిక్వెస్ట్.. సీక్వెల్ అంటూ

'యాత్ర' సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్‌ను ఎంతగానో ఎలివేట్ చూపించాడు మహీ వీ రాఘవ్. ఈ సినిమా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కూడా బాగానే ఉపయోగపడింది. ఇక, ఈ చిత్రం వచ్చిన తర్వాత వైఎస్ కుటుంబ అభిమానులంతా జగన్‌పైనా సినిమా తీయమని దర్శకుడు మహీ వీ రాఘవ్‌ను కోరారు. అప్పుడు 'యాత్ర'కు సీక్వెల్ తీస్తున్నట్లు సూచనలు ఇచ్చాడతను.

జగన్‌ బయోపిక్ తీస్తానంటూ ప్రకటన

జగన్‌ బయోపిక్ తీస్తానంటూ ప్రకటన

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మహీ వీ రాఘవ్ తన తదుపరి సినిమా కూడా బయోపిక్ చేస్తున్నట్లు ఓ సందర్భంలో చెప్పాడు. అంతేకాదు, అది వైఎస్ జగన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందబోతున్నట్లు కూడా వెల్లడించాడు. ఇందుకోసం ఆయన పర్మీషన్ కూడా తీసుకున్నాడు.

పట్టాలెక్కబోతున్న జగన్ బయోపిక్

పట్టాలెక్కబోతున్న జగన్ బయోపిక్

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బయోపిక్ గురించి చెప్పి చాలా రోజులు అవుతున్నా.. దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదని అంతా అనుకున్నారు. కానీ, మహీ వీ రాఘవ్ మాత్రం ఈ సినిమా కోసం గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నాడట. కరోనా వల్ల ఇది ఆలస్యం అయిందని తెలిసింది. ఇక, కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టును ప్రకటించి ప్రారంభిస్తారని తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్ పాత్రలో యంగ్ హీరో

ఏపీ సీఎం జగన్ పాత్రలో యంగ్ హీరో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బయోపిక్ గురించి తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అదేమిటంటే.. ఈ సినిమా జగన్ పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీని తీసుకున్నారట. ఇప్పటికే దీనికి అతడు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని టాక్. గుజరాతీలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రతీక్.. 'స్కామ్ 1992'లో అదిరిపోయే పాత్రను పోషించాడు.

జగన్ బయోపిక్ అసలు కథ ఇదేనట

జగన్ బయోపిక్ అసలు కథ ఇదేనట

తాజా సమాచారం ప్రకారం.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బయోపిక్ కథ వైఎస్సార్ చనిపోయిన దగ్గర నుంచి మొదలవుతుందట. ఇందులో పాదయాత్రను బాగా హైలైట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అలా మొదలై ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ ఈ సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది. మధ్యలో ఆయనపై కొందరు కుట్రలు చేసినట్లు కూడా చూపిస్తారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X