Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
Salaar: పది నిమిషాలకే రూ. 20 కోట్లు ఖర్చు.. ప్రభాస్ రేంజ్‌కు ఆమాత్రం ఉండాల్సిందే
కొంత కాలంగా రెబెల్ స్టార్ ప్రభాస్ యమ జోష్‌తో కనిపిస్తున్నాడు. అందుకే ఒక సినిమా పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' మూవీని పూర్తి చేశాడతను. అది షూటింగ్ జరుగుతుండగానే మరికొన్ని సినిమాలను ఓకే చేసుకున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K', ప్రశాంత్ నీల్ తెరకెక్కించే 'సలార్', ఓం రౌత్ డైరెక్షన్లో 'ఆదిపురుష్', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' వంటి మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ ఒక్కొక్కటిగా ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఆయా సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నాడు.
హాట్ వీడియోలో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ దారుణంగా!
ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం 'సలార్' అని చెప్పొచ్చు. దీనికి కారణం ఈ చిత్రాన్ని 'కేజీఎఫ్' వంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందించిన ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండడమే. ఎప్పుడో మొదలైన ఈ మూవీ షూటింగ్.. మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో కంప్లీట్ చేసుకుంది. అందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ ఫైట్‌ను కూడా రూపొందించారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెండోది కూడా మొదలైంది. ఈ షెడ్యూల్లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూట్ చేసుకున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుజరాత్లో రెండో షెడ్యూల్ ప్లాన్ చేసినా.. కోవిడ్ నిబంధనల కారణంగా షూటింగ్‌ను హైదరాబాద్‌కు షిప్ట్ చేశారు. ఇక, ఇప్పుడు ఈ సినిమాలోనే ఎంతో హైలైట్ అయిన ప్రీ క్లైమాక్స్ ఫైట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియో భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నారని అంటున్నారు. దీని కోసం దాదాపు 20 నుంచి 30 రోజుల పాటు షూటింగ్‌ను జరపబోతున్నారట.
Anasuya Bharadwaj తో అది కావాలన్న హైపర్ ఆది: పుష్ప నటుడితో బేరాలు.. వైరల్‌గా వీడియో!
తాజా సమాచారం ప్రకారం.. 'సలార్' మూవీ మొత్తంలోనే ఎంతో హైలైట్‌గా నిలవబోయే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా రూ. 20 కోట్లు ఖర్చు చేస్తుందట. ఇందులో దాదాపు 200 మంది ఫైటర్లు పాల్గొనబోతున్నారని అంటున్నారు. అంతేకాదు, దీని కోసం కొందరు విదేశీ ఫైటర్లను కూడా తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సినిమాలో దాదాపు పది నిమిషాల పాటు ఉండే ఒకే ఒక్క ఫైట్ కోసం రూ. 20 కోట్లు ఖర్చు చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ రేంజ్ అంటే ఆమాత్రం ఉండాల్సిందే అని పలువురు కామెంట్ చేస్తున్నారు.
క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దీన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.