సింగపూర్ లో వరుణ్ సందేశ్ హీరోయిన్ సైడ్ ఇనకమ్
వరుణ్ సందేశ్ తో ప్రియుడు చిత్రంలో చేసిన ప్రీతికారావు గుర్తుండే ఉంటుంది. అమృతారావు చెల్లెలైన ఆమెకు ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ ఏమీ రాలేదు. దాంతో ఆమె కన్నడ చిత్రాల్లో బిజీ అవటం ప్రారంభించింది. తాజాగా ఆమె సింగపూర్ కి ఆమె తొలి కన్నడ చిత్రం షూటింగ్ నిమిత్తం వెళ్లింది. అక్కడ షూటింగ్ అవ్వగానే ఆమె కాసినోల కి వెళ్లటం ప్రారంభించింది. ఈ విషయం ఆమె స్వయంగా ట్విట్టర్ లో చెపుతూ.. సింగపూర్ లోని మెరీనా బే సేండ్స్ కాసినో కు వెళ్లారు. పది డాలర్లు కాస్తే మూడు వందల డాలర్లు మొదటిసారే గెలుచుకున్నారు. దాంతో రోజూ వెళ్తున్నారు.
మంచి ఆదాయం ఉంది. చాలా ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది. ఇది విన్న ఆమె యూనిట్ సభ్యులు ఆమెకు ఇప్పుడు తమ సినిమా ద్వారా వచ్చే ఆదాయం కన్నా కాసినో ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంది. అందుకే ఆమె దృష్టి అంతా అటే పెడుతోంది అని వాపోతున్నారు. అక్కడికి వెళ్లటం కోసం ఆమె త్వరగా తన సీన్స్ అవగొట్టమని డైరక్టర్ పై ఒత్తిడి తెస్తోందిట. మరి ఈ కాసినో బెట్టింగ్ వ్యవహారం ఎక్కడిదాకో వెళ్తుందో అంటున్నారు సినీ జనం.


Click it and Unblock the Notifications











