Mamitha Baiju: దళపతి విజయ్ తో ప్రేమలు బ్యూటీ..మమితా బైజు రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
Mamitha Baiju: యంగ్ హీరోయిన్ మమిత బైజు 'ప్రేమలు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ఒక హిట్ తో క్రేజీ పాపులారిటీని సొంతం చేసుకుంది. తెలుగులోనూ ఈ బ్యూటీ తెగ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ ఒక్క సినిమాతో అటు మలయాళంలోనూ ఇటు తెలుగు సినిమాలో కూడా బాగా పాపులారిటీ తెచ్చుకుంది ఈ అమ్మడు. కాగా ఈ యూత్ ఫుల్ సినిమా మోలీవుడ్ లో భారీ హిట్ అయ్యి రికార్డు వసూళ్లు సాధించింది. కాగా ఇక్కడ నుంచి మమిత పేరు కూడా బాగా వైరల్ అయ్యింది. ఈ తరుణంలో మమితా బైజు కు సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది. మీరు కూడా ఓ లూక్కేయండి.
హీరోయిన్ మమిత బైజు క్రేజ్ మమూలుగా లేదు. ఈ అమ్మడుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేమలు తర్వాత ఈ అమ్మడుకు ఊహించిన విధంగా లక్కి ఛాన్స్ కొట్టేసింది. అది కూడా తమిళ బిగ్గెస్ట్ స్టార్ విజయ్ దళపతి లాస్ట్ సినిమా 'దళపతి 69'లో నటించే అవకాశం కొట్టేసింది. ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే ఆల్రెడీ లాక్ అయ్యినట్టుగా వార్తలు ఉన్నాయి. దీనితో పూజా హీరోయిన్ గా నటిస్తే మమిత ముఖ్య పాత్రలో నటిస్తుంది అని తెలుస్తుంది.

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాలయ్య నటించిన "భగవంత్ కేసరి"ని దళపతి విజయ్ చివరి సినిమాగా తెరకెక్కనున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ రీమేక్ మూవీలో విజయ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే, శ్రీలీల పాత్రని మమిత బైజు చేయనన్నట్టు డీల్ సెట్ అయినట్టు తెలుస్తోంది. దీంతో అతి తక్కువ సమయంలో దళపతి విజయ్ లాంటి బిగ్ స్టార్ లో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది మమిత కెరీర్ లోనే ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించనున్నాడు.
పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కబోతున్న ఈ మూవీలో భగవంత్ కేసరి షేడ్స్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. 'దళపతి 69' సినిమాను భగవంత్ కేసరికి రీమేక్ గా వస్తుందా లేక కేవలం కోర్ లైన్ తీసుకొని విజయ్ కి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారా అనేది క్లారిటీ లేదు. ఇదెలా ఉంటే.. 'దళపతి 69' సినిమాలో నటించే అవకాశం కొట్టేసినా మమితా బైజు రెమ్యూనరేషన్ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ మూవీ నటించడానికి మమితా బైజు ఎన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతుందంటే?
ఎలాంటి అంచనాలకు లేకుండా చిన్న మూవీగా విడుదలై కలెక్షన్ల పరంగా ప్రేమలు (Premalu) మూవీ పెద్ద హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మమితా బైజు (Mamitha Baiju) ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రేమలు సినిమా కోసం రూ. 50 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రేమలు సక్సెస్ తో ఈ బ్యూటీ పారితోషికం పెంచేశారని, ప్రస్తుతం దళపతి 69 కోసం రూ. కోటీ రూపాయల వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











