ప్రిన్స్ మహేష్‌ బాలీవుడ్ ఎంట్రీ.. ప్రముఖ నిర్మాత, దర్శకులతో చర్చలు!

By Rajababu

భరత్ అనే నేను సక్సెస్‌తో ప్రిన్స్ మహేష్‌బాబు మంచి జోష్‌లో ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ అందించిన విజయంతో డైరెక్టర్ వంశీ పైడిపల్లితో జతకట్టారు. ఈ చిత్రం కోసం కొత్త గెటప్‌లో కనిపించనున్నారు. అందుకోసం యంగ్ లుక్‌తో ముందుకొస్తున్నారు. ఇలా వైపు తెలుగు సినిమాలను పట్టాలెక్కిస్తూనే బాలీవుడ్ చిత్రంపై దృష్టిపెట్టినట్టు ముంబై మీడియా కోడైకూస్తున్నది.

ముంబైలో ప్రిన్స్ మహేష్‌బాబు

ముంబైలో ప్రిన్స్ మహేష్‌బాబు

గత కొద్దికాలంగా బాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రిన్స్ మహేష్ ఎదురుచూస్తున్నారు. కథ, ఇతర అంశాలు కలిసి రాకపోవడంతో సమయం కోసం వేచిచూస్తున్నారు. ఓవైపు మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ అందుకు తగిన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే ఓ బాలీవుడ్ సినిమా గురించి చర్చలు జరిపడానికి ఇటీవల అత్యవసరంగా ప్రిన్స్ మహేష్ ముంబై వెళ్లడం చర్చనీయాంశమైంది.

ప్రముఖ నిర్మాణ సంస్థతో

ప్రముఖ నిర్మాణ సంస్థతో

బాలీవుడ్ చిత్రం కోసం ఓ ప్రముఖ నిర్మాత, దర్శకులతో ప్రిన్స్ మహేష్ బాబు సంప్రదింపులు జరిపినట్టు ముంబై మీడియా కథనాలను వెల్లడించారు. ఇటీవల ముంబైలో జరిగిన చర్చలపై మహేష్ సంతృప్తికరంగా ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో త్వరలోనే బాలీవుడ్ సినిమా ఎంట్రీ జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని సినీవర్గాల సమాచారం.

 బాలీవుడ్‌లో జోరుగా

బాలీవుడ్‌లో జోరుగా

ప్రిన్స్ మహేష్‌బాబు బాలీవుడ్ సినిమాపై వార్తలు జోరుగా వినిపిస్తున్నప్పటికీ.. ఇంకా ఆ సినిమాపై క్లారిటీ లేదు. అధికారికంగా ధృవీకరణ కూడా జరుగలేదు. కానీ బాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది.

దక్షిణాదిలో ప్రిన్స్ మహేష్ ఎంట్రీ

దక్షిణాదిలో ప్రిన్స్ మహేష్ ఎంట్రీ

తెలుగులో వచ్చిన ప్రిన్స్ మహేష్ చిత్రాలు హిందీలోకి డబ్ అవుతున్నాయి. అంతేకాకుండా వాటికి మంచి ప్రేక్షకాదరణ కూడా లభిస్తున్నది. దాంతో మహేష్ బాబు మార్కెట్ కూడా విస్తరిస్తున్నది. దర్శకుడు మురగదాస్ రూపొందించిన స్పైడర్ చిత్రంతో అధికారికంగా దక్షిణాదిలో కాలుపెట్టారు. ఇక బాలీవుడ్‌ ఎంట్రీయే బాకీ ఉన్నది.

బాలీవుడ్‌కు చిత్రాలకు రెడీ

బాలీవుడ్‌కు చిత్రాలకు రెడీ

ఇటీవల జాతీయ మీడియాతో ప్రిన్స్ మహేష్ బాబు మాట్లాడుతూ.. బాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి సిద్ధమే. కానీ కథ, ప్రాజెక్టు నచ్చితే అందుకు తాను సిద్ధం అని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం తన కెరీర్‌లో 25వ చిత్రం కోసం వంశీ పైడిపెళ్లి, దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కోసం రెడీ అయ్యారు. ఎక్కువ శాతం ఈ చిత్ర షూటింగ్ అమెరికాలో జరుగనున్నది. అలాగే ఈ చిత్రం కోసం మహేష్ గెడ్డం కూడా పెంచుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X