రవితేజని తిరుగులేని స్టార్ ని చేసింది పూరి కాదు మహేష్ బాబు...!
రవితేజ ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయ్యాడంటే, సినిమాకి అయిదు కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడంటే అందుకు కారణం పూరి జగన్నాథ్ అన్నది జగద్విదతం. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్ సినిమాలతో రవితేజని పూరి తిరుగులేని స్టార్ ని చేశాడు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి అతడిని మరింత పెద్ద హీరోని చేసింది. అయితే ఈ చిత్రాలు రవితేజకి అదృష్టం కొద్దీ దక్కాయట. ఇవే కథల్ని మహేష్ బాబుకి వినిపిస్తే అతను నచ్చలేదని చెప్పాడట.
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, దేశముదురు కథలు వినిపించాకా, ఏదీ నచ్చలేదని మహేష్ అనే సరికి స్టార్లు వెంట పడడం అనవసరమనుకుని పూరి తనకు తెలిసిన రవితేజని హీరోని చేశాడు. అప్పుడే ఆ కథల్లో ఏదో ఒకటి మహేష్ ఓకే చేసి ఉండుంటే రవితేజ ఇంత పెద్ద హీరో అయి ఉండేవాడు కాదు. అఫ్ కోర్స్, మహేష్ ని తర్వాత పోకిరి కథ చెప్పి మెప్పించి అతడికి భారీ హిట్టిచ్చాడనుకుకోండి..అది వేరే సంగతి...


Click it and Unblock the Notifications











