మహేశ్ - రాజమౌళి మూవీలో ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్: సూపర్ హీరోస్‌లా ఇంత మంది స్టార్లా!
తెలుగు సినిమా స్థాయిని అమాంతం విశ్వవ్యాప్తంగా పెంచేసిన దర్శకుడే ఎస్ఎస్ రాజమౌళి. 'బాహుబలి'తో పాన్ ఇండియాను శాసించిన అతడు.. 'RRR'తో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. దీంతో ఇప్పుడు మరింత హై రేంజ్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే జక్కన్న త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మూవీ చేయబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో మరో స్టార్ హీరో కూడా భాగం అయినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఎవరా హీరో? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
మహేశ్ బాబుతో జక్కన్న
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా బడా స్టార్లుగా వెలుగొందుతోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలిసి మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. దీనికి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. ఇందులో ఎంతో మంది స్టార్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అవి పూర్తి చేసేశారుగా
సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందనున్న రాజమౌళి - మహేశ్ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను తయారు చేసినట్లు తెలిసింది. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ కథపై పని చేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే దాన్ని కూడా కంప్లీట్ చేశారు.
అడ్వెంచర్ స్టోరీతోనే
అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న మహేశ్.. రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇందులో మహేశ్ బాబు లుక్స్ కూడా టార్జాన్ మాదిరిగా ఉండబోతున్నాయని టాక్.

అప్పటి నుంచే స్టార్ట్
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తీస్తున్న ఈ సినిమా 2022 ద్వితీయార్థంలోనే మొదలవుతుందని టాక్ వచ్చింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతోంది. అయితే, ఇప్పుడు మహేశ్, రాజమౌళి ఈ మూవీ ప్రీ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ డైలాగ్ రైటింగ్ జరుగుతోంది. ఇది పూర్తైన వెంటనే అంటే ఈ ఏడాది ద్వితియార్థంలో దీన్ని ప్రారంభిస్తారని సమాచారం.
సినిమాలో మరో హీరో
ఇండియాలోనే టాప్ ప్రాజెక్టుగా రాబోతున్న మహేశ్ బాబుతో పాటు చాలా మంది స్టార్ హీరోలు కూడా నటించబోతున్నట్లు ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే నాగార్జున ఇందులో కీలక పాత్ర చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో లీక్ అయింది.

మళ్లీ అలాంటి రోల్
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిసి చేస్తున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నాడట. అంతేకాదు, మహేశ్ బాబుతో సమానమైన పాత్ర అని తెలిసింది. అలాగే, ఇందులో అతడు హీరో ఫ్రెండ్‌గా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో దీనిపై హైప్ పెరుగుతోంది.


Click it and Unblock the Notifications











