మహేశ్ బాబు సినిమాలో మరో స్టార్ హీరో: ఈ ఇద్దరిలో ఒకరు ఖాయం.. త్రివిక్రమ్ ప్లాన్ అదేనా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తూ ముందుకు సాగుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కృష్ణ కుమారుడిగా పరిచయం అయిన అతడు.. ఆరంభం నుంచీ తనదైన సినిమాలతో అలరిస్తున్నాడు. అదే సమయంలో ఎన్నో విజయాలను సైతం ఖాతాలో వేసుకోవడంతో పాటు కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మహేశ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్నాడు. ఇందులో మరో హీరో కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

 హ్యాట్రిక్ హిట్లతో ఫుల్ ఫామ్‌లో

హ్యాట్రిక్ హిట్లతో ఫుల్ ఫామ్‌లో

కొంత కాలంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు విజయాల పరంపరతో ఫామ్‌లోకి వచ్చాడు. కొరటాల శివతో చేసిన 'భరత్ అనే నేను' నుంచి మొదలుకొని వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో హ్యాట్రిక్‌ను కూడా అందుకున్నాడు. అలాగే మహేశ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసి హవాను చూపిస్తున్నాడు.

సర్కారు వారి పాటలో మహేశ్

సర్కారు వారి పాటలో మహేశ్

ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దీనికి థమన్ సంగీతం అదిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తైనట్లు తెలిసింది.

ఆ డైరెక్టర్‌తో మూడోసారి జోడీ

ఆ డైరెక్టర్‌తో మూడోసారి జోడీ

ఒక సినిమా పట్టాలపై ఉండగానే మరో దానిని లైన్‌లో పెట్టుకుంటూ వస్తున్న మహేశ్ బాబు.. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబోలో సినిమా రాబోతుండడంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

 ఆలస్యం అవుతోన్న ప్రాజెక్టు

ఆలస్యం అవుతోన్న ప్రాజెక్టు

మహేశ్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయాల్సిన సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, సర్కారు వారి పాట షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతుండడంతో ఇది పట్టాలెక్కలేదు. ఇంతలో ఇటీవలే మహేశ్ బాబు మోకాలికి సర్జరీ జరిగింది. ఆ తర్వాత అతడికి కరోనా సోకింది. దీంతో అతడి ప్లాన్స్ మొత్తం మారిపోయాయి. ఇక, ఈ మూవీ అధికారికంగా ఇటీవలే మొదలైంది.

పనులు పూర్తి... నటుల కోసం

పనులు పూర్తి... నటుల కోసం

సూపర్ స్టార్‌తో చేయబోయే సినిమా విషయంలో త్రివిక్రమ్ పక్కా ప్లాన్లను చేసుకుంటున్నాడు. ఈ మూవీ కోసం గురూజీ ఎప్పుడో డైలాగ్ వెర్షన్‌తో కూడిన ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడు. అంతేకాదు, థమన్ కూడా కొన్ని పాటలు సిద్ధం చేసి పెట్టేశాడు. మొత్తంగా ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి.. ఇప్పుడు నటుల ఎంపిక మీద దృష్టి సారించారని తెలిసింది. ఇలా కొంత మందిని ఎంపిక చేసేశాడు.

మహేశ్‌తో మరో స్టార్ హీరోనూ

మహేశ్‌తో మరో స్టార్ హీరోనూ

స్టార్ హీరో మహేశ్ బాబు కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో మహేశ్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే నటీనటుల గురించి ఎన్నో రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ కోసం మహేశ్ కాకుండా మరో స్టార్ హీరోను కూడా తీసుకోబోతున్నారని తెలిసింది.

ఈ ఇద్దరిలో ఒకరు గ్యారెంటీ

ఈ ఇద్దరిలో ఒకరు గ్యారెంటీ

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరోలు పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ, ఫహాద్ ఫాజిల్‌ను కానీ తీసుకోబోతున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్ వాళ్లతో చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే వేరే ఇండస్ట్రీల నటులను తీసుకుంటున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X