twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియా వారియర్ 'కిర్రాక్' ఫోటోషూట్: పింక్ డ్రెస్సులో పిచ్చెక్కించింది..

    |

    Recommended Video

    రణవీర్ సింగ్ తో రొమాన్స్ చెయ్యబోతున్న ప్రియా వారియర్

    ఒక్క ఎక్స్‌ప్రెషన్‌.. కుర్రకారు గుండెలను యమా గిలిగింతలు పెట్టింది. ఆమె కంటి సైగలకు దేశం మొత్తం ఫిదా అయిపోయింది. చూపులతోనే ట్రిగ్గర్ నొక్కేసినంత పనిచేసిన ప్రియా వారియర్.. ఇప్పుడు ఎంతోమంది యువత గుండెల్లో కొలువుదీరింది. ఆమెకు సంబంధించిన చిన్న ఫోటో బయటకొచ్చినా సరే.. క్షణాల్లో అది వైరల్ అవుతోంది. అదీ ఇప్పుడామె క్రేజ్. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ఓ ఫోటోషూట్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది.

     పింక్ గౌనులో..:

    పింక్ గౌనులో..:

    తాజా ఫోటోషూట్ లో ప్రియా వారియర్ పింక్ కలర్ గౌనులో హొయలు పోయింది. రెండు చేతులు నడుంపై పెట్టుకుని ఆమె నవ్విన నవ్వు యూత్ కు మరోసారి మత్తెక్కించేలా ఉంది.

     50లక్షలు దాటిన ఫాలోవర్స్..:

    50లక్షలు దాటిన ఫాలోవర్స్..:

    ఇక మరో స్టిల్‌లో.. కాలు మీద కాలేసుకు కూర్చుకుని, ఓ చేయిని ఒడిలో మరో చేతిని గడ్డం కింద పెట్టుకుని ఫోటోకు పోజులు ఇచ్చింది. ఆ స్టిల్‌లో ప్రియా చిరునవ్వుల్ని చూసి యువత క్రేజీగా ఫీలవుతున్నారు. ఇలాంటి క్రేజ్ తోనే ప్రియా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య కూడా 50లక్షలు దాటిపోయింది.

     ఒక్కో పోస్టుకు రూ.8లక్షలా?:

    ఒక్కో పోస్టుకు రూ.8లక్షలా?:

    ఎప్పుడైతే 'ఒరు అదార్ లవ్' టీజర్ బయటకొచ్చిందో అప్పటినుంచి ప్రియా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. కనుసైగలతో.. హావభావాలతో ఆమె చేసిన మాయకు అందరినీ అలా కట్టిపడేసింది. ఆ క్రేజే ఇప్పుడు ప్రియాకు ఫుల్లుగా క్యాష్ తెచ్చిపెడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకున్న ఫాలోయింగ్ రీత్యా.. ఒక్కో పోస్టుకు ప్రియాకు రూ.8లక్షల దాకా ఇస్తున్నట్టు టాక్.

    అప్పుడే గోల్డెన్ ఆఫర్..:

    అప్పుడే గోల్డెన్ ఆఫర్..:

    'ఒరు అదార్ లవ్' ఇంకా విడుదలే కాలేదు, అప్పుడే ప్రియాకు అవకాశాలు వెల్లువెత్తుతుండటం విశేషం. తెలుగులో వచ్చిన టెంపర్ రీమేక్ గా హిందీలో తెరకెక్కుతున్న సింబాలో ప్రియా వారియర్‌ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అదే జరిగితే త్వరలోనే ప్రియా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఖాయమైనట్టే. ఇక తెలుగులోనూ ఆమెను నటింపజేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. చూడాలి మరి.. తెలుగులో ప్రియా ఏ ప్రాజెక్ట్ కమిట్ అవుతుందో!

    English summary
    Actress Priya Varrier recently became one of the most searched for Indian people on the internet. Her recent photo shoot gone viral in internet
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X