మెగా అల్లుడు కల్యాణ్ దేవ్‌కి కుర్ర హీరోయిన్ షాక్.. ఏం జరిగిందంటే..!
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ తన రెండో సినిమాకు సిద్దమవుతున్నాడు. తన మొదటి సినిమా విజేత తర్వాత మళ్లీ సరికొత్త సినిమాతో ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్ల పేర్లను చిత్ర యూనిట్ పరిశీలనలోకి తీసుకొన్నది. అయితే కుర్ర హీరోయిన్ కల్యాణ్ దేవ్ పక్కన నటించడానికి ఒప్పుకోకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే..

నా రెండో సినిమా గురించి
కల్యాణ్ దేవ్ ఇటీవల తన ఇన్స్‌టాగ్రామ్‌లో తన రెండో సినిమా గురించి వెల్లడించారు. నా సెకండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పులి వాసుతో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందుతున్నది. మ్యూజిక్ తమన్ అందిస్తున్నారు. మీ దీవెనలు కావాలి అని కల్యాణ్ దేవ్ పేర్కొన్నారు.

ఇంటర్నెట్ సెన్సేషన్‌గా ప్రియా వారియర్
ఇటీవల కాలంలో మలయాళ బ్యూటీ ప్రియా వారియర్ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. ఆమె నటించిన ఏకైక చిత్రం ఓరు ఆధార్ లవ్ చిత్రం విడుదలై సెన్సేషన్‌గా మారింది. ఆ సినిమాలో ఓ పాటలో కన్ను గీటడం దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. అప్పటి నుంచి ప్రియా వారియర్ పేరు మారిమోగిపోయింది. దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే.

హీరో కల్యాణ్ దేవ్‌కు నో
ఇండియాలో క్రేజీ హీరోయిన్‌గా మారిన ప్రియా వారియర్‌ను కల్యాణ్ దేవ్ సరసన నటింపజేయాలని అనుకొన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించారు. అయితే కారణం ఏదో తెలియదు గానీ టాలీవుడ్ చిత్రంలో నటించేందుకు నిరాకరించినట్టు సమాచారం. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నది. పులి వాసు ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించనున్నారు.

టాప్ హీరోలపై ప్రియా వారియర్ గురి
టాలీవుడ్‌లో కొత్త హీరోలతో నటించడానికి ఇష్టపడటం లేదు. దక్షిణాదిలో మహేష్ బాబు, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు ఆసక్తి చూపుతున్నది. అందుకే కల్యాణ్ దేవ్‌లో నటించడానికి ఒప్పుకోలేదనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

దిల్ రాజు సినిమాతో ప్రియా వారియర్
టాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులపై ప్రియా వారియర్ ఆసక్తిగా ఉందనే సమాచారం. కొన్ని సినిమాలను ఇంకా పెండింగ్‌లోనే పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం దిల్ రాజు రూపొందించే సినిమాలో ప్రియా వారియర్ నటిస్తున్నది. ఇంకా మలయాళంలో కొన్ని సినిమాల్లో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











