ఆమెకు ఎన్టీఆర్ రికమెండేషన్
ఎన్టీఆర్ సిఫార్స్ చేస్తే కాదనదేముంది..ఆమెనే పెట్టుకుందాం అని దర్శక, నిర్మాతలు ఫిక్సయ్యారు. యమదొంగ చిత్రంలో హీరోయిన్ గా చేసిన ప్రియమణి తాజాగా అతని ప్రక్కనే మరో చిత్రంలో బుక్కయినట్లు సమాచారం. మున్నా చిత్రంతో పరిచయమైన వంశి పైడిపల్లి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో ఆమె నటించటానికి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో చేయటానికి ఎన్టీఆర్ ఆమెను రికమెండ్ చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నారు. మొదట వంశి పైడిపల్లి తన హీరోయిన్ ఇలియానాని అనుకున్నారని సమాచారం. అయితే పూర్తి స్క్రిప్టు విన్న ఎన్టీఆర్ హీరోయిన్ గా ఎవరని అనుకుంటున్నావు అని అడగటంతో ఇంకా ఏది పిక్స్ చేయలేదని వంశి సమాధానమిచ్చాడని తెలుస్తోంది.
దాంతో ప్రియమణి బాగుంటుందేమో చూడు అని సలహా ఇచ్చాడని, వెంటనే ఆమె డేట్స్ కోసం అడిగారని తెలుస్తోంది. దాంతో అన్యాపదేశంగా చెప్పినా ఆ ప్రాజెక్టులోకి ప్రియమణి రావటం వెనక ఎన్టీఆర్ ఇన్ఫూలయిన్స్ కారణమంటున్నారు. ఇక ఈ సినిమాకు బృందావనం అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రియమణి తాజాగా బాలకృష్ణ ప్రక్కన మిత్రుడు చిత్రంలో చేసిన విషయం తెలిసిందే. వరసగా నందమూరి వంశీయుల ఆఫర్స్ ఆమె పొందటం విశేషం. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్..వి.వి.వినాయిక్ దర్శకత్వంలో అదుర్స్ సినిమా చేస్తున్నారు. అతని ప్రక్కన నయనతార చేస్తోంది.


Click it and Unblock the Notifications











