లేటు వయస్సులో ప్రియమణితో ఆఫ్ స్క్రీన్ ఎఫైర్?
ప్రియమణి ఈ మధ్య ఏదోలో ఉంటోంది. తరచూ ఆలోచనల్లో పడిపోతోంది. ఇదంతా జగపతి బాబు పుణ్యమేనంటున్నారు సినీ జనం. గత కొద్ది కాలంగా ప్రియమణి, జగపతి బాబుల మధ్య జరుగుతున్న ఆఫ్ స్క్రీన్ ఎఫైర్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరూ షూటింగ్ లేకపోయినా తరుచూ హోటల్స్ లో కలుస్తున్నారని, ఫోన్స్ లో అయితే గంటలు తరబడి ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారని అంటున్నారు. దాంతో లేటు వయస్సులో ప్రియమణితో ప్రేమలో పడ్డాడు జగపతి బాబు అని చెవులు కొరుక్కుంటున్నారు. అందులోనూ రీసెంట్ గా రిలీజైన ప్రవరాఖ్యుడు చిత్రంలో వారిద్దరి మద్యా వచ్చే రొమాంటిక్ సీన్స్ బాగా పండటం కూడా ఈ వార్తకు బలం చేకూరుస్తోంది. దాంతో మీడియా వారు జగపతి బాబుని ఈ విషయమై ప్రశ్నించారు. దానికాయన స్పందిస్తూ...మేం చాలా మంచి స్నేహితులం..మా మధ్య ఉన్న స్నేహానుభంధం తెరపై రిఫ్లెక్ట్ అయి మా రొమాంటిక్ సీన్సి రియల్ గా ఉన్న అనుభూతిని కలగచేస్తున్నాయి..అంతే అంతకు మించి మా మద్య ఏమీ లేదు అంటూ వివరణ ఇచ్చారు. ఇక జగపతి బాబు, ప్రియమణి కాంబినేషన్లో మూడో సారి సాధ్యం అనే చిత్రం రూపొందుతోంది. కుమార్ బ్రదర్స్ సినిమా పతాకంపై కుమార్ బ్రదర్స్ ఈ 'సాధ్యం' చిత్రం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాతో కార్తీకేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.


Click it and Unblock the Notifications











