మహేష్ తోనా..అదేం లేదు
మహేష్ బాబుని అసలు నేను కలవలేదు..అలాంటిది అతని సినిమాలో నేను నటిస్తున్నాననే రూమర్ ఎలా పుట్టించారో అర్ధం కావటం లేదంటోంది ప్రియమణి. వరుడు సినిమాలో రెండో హీరోయిన్ ఆమె బుక్కయిందన్న విషయాన్ని ఖండిస్తూ ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. నిజానికి నేను మహేష్ వచ్చి తన సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా చేయమన్నా చేయను..ఎందుకంటే నేను సోలో హీరోయిన్ గా నిలదొక్కకునే ప్రయత్నాల్లో ఉన్నాను. బికినీ వేసినా, నేషనల్ అవార్డు తెచ్చుకున్నా నాకంటూ ఓ స్టైల్ ఉండాలి, ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావిస్తాను...అయితే మణిరత్నం రావణ్ లో ఎందుకు నటిస్తున్నారు అంటే దానికి సమాధానం ఉంది..మణిరత్నం వంటి మహా దర్శకుడుతో పనిచేయాలన్నది నా తీరని కల..అలాగే ఆ చిత్రంలో నాది ఓ భిన్నమైన పాత్ర..రెండో హీరోయిన్ మాత్రం కాదు..అంటోంది. అలాగే అభిషేక్ బచ్చన్ చాలా గొప్పవాడంటూ పొగిడింది. ఇక సహనటుడు పృధ్వీరాజ్, తరుణ్ లతో లవ్ ఎఫైర్ గురించి ఎప్పటి పాటే పాడింది.


Click it and Unblock the Notifications










