బికినీ సుందరి ప్రియమణి ఈమధ్య మలయాళ నటుడు పృధ్వీరాజ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందనే కాస్త ముందుకెళ్ళి పబ్స్, క్లబ్స్ లు అని తిరుగుతున్నారని సమాచారం. తరచుగా కేరళలోని ప్రముఖ పబ్‌లు, రెస్టారెంట్లలో గంటలు గంటలూ గడుపటం గమనించినవారు ఏమిటి ఇలా తిరుగుతున్నారు? లవ్వా అని అడిగితే అదేం లేదని ఇద్దరూ ఒకే సారి అంటున్నారుట. అంతేగాక తామిద్దరం కలసి నటిస్తోన్న రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయనీ, అందులో క్యారెక్టర్స్ ని ఇంకెలా ఇప్రవైజ్ చేయవచ్చు అని ఆలోచిస్తూ..చర్చిస్తున్నామని, అవి లైఫ్ ఇచ్చే సినిమాలు కాబట్టి ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారని సమాచారం. దాంతో ఇదేంటి మరీ విచిత్రం పబ్బల్లో స్టోరీ డిష్కషన్సా అంటే కొంచెం ఢిఫెరెంట్ గా ప్రయత్నిస్తున్నామని సెలవిచ్చారట. ఏదో నేర్చినమ్మ బొంకు నేర్వదా అని అది విన్నవాళ్ళు సరిపుచ్చుకుంటున్నారు.