రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో ప్రియమణి కూడా?

బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' పేరుతో మరో భారీ ప్రాజెక్ట్ మొదలైన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత డివివి దానయ్య రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ తప్ప ఇతర తారాగణం ఎవరు? అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. హీరోయిన్ల ఎంపిక కూడా జరుగాల్సి ఉంది.

Priyamani in Rajamoulis RRR

తాజాగా అందుతున్న సమాచారం ప్రియమణి కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. రాజమౌళి దర్శకత్వంలో గతంలో ప్రియమణి 'యమదొంగ' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

మరో వైపు ఈ మూవీలో హీరోయిన్ల ఎంపిక కూడా జరుగాల్సి ఉంది. దీంతో పాటు విలన్ పాత్ర చేసేది ఎవరు? చేస్తున్నారనే ఆసక్తి సైతం ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఈ సస్పెన్స్ కొంతకాలం ఇలానే కొనసాగిస్తారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X