ఏం చేస్తాం...రేప్ చేస్తేనే ప్రియమణికి కలిసివస్తోంది!!
చూస్తుంటే ప్రియమణి..రేప్ సీన్ల స్పెషలిస్టు గా మారిపోయేటట్లు కనపడుతోందంటున్నారు. ఎందుకంటే మామూలు సన్నివేశాల్లో ఏమి చేసినా ఆమెకు రాని పేరు రేప్ సీన్ చేస్తే వస్తోందని విశ్లేషిస్తున్నారు. దానికి నిదర్శనంగా ఆమెకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పరుత్తివీరన్ లో గ్యాంగ్ రేప్ సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచి అవార్డు వచ్చేలా చేసిందని చెప్తున్నారు. అలాగే రీసెంట్ గా రిలీజైన మణిరత్నం రావణ్ లోనూ ఆమె..పోలీసుల గ్యాంగ్ రేప్ కు గురయ్యే సన్నివేశంలో చాల సహజంగా నటించిందంటూ ప్రశంసలు వస్తున్నాయట. సినిమా ప్లాప్ అయినా ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే ఆమె రీసెంట్ గా ఓ మళయాళ చిత్రం ఒప్పుకుందని అందులోనూ రేప్ సన్నివేశం ఉండబోతోందని, అదీ గ్యారెంటీగా వర్కవుట్ అవుతుందని చెప్తున్నారు. అయినా ఈ రేప్ సెంటమెంట్ ఏంటి విచిత్రంగా అని కొంతమంది నవ్వుకున్నా నిజాలు ఒప్పుకోక తప్పటం లేదు. ప్రస్తుతం ప్రియమణి..రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర చిత్రంలో సూర్య సరసన నటిస్తోంది.


Click it and Unblock the Notifications











