ఆ సినిమాకి ప్రియమణే నిర్మాత?
తమకు అవకాశాలు తగ్గినప్పుడు హీరోలు,దర్శకులు సాధారణంగా తమ స్వంత డబ్బుతో నిర్మాతగా మారి తిరిగి లైమ్ లైట్ లోకి రావటానకి ప్రయత్నం చేస్తూంటారు. ఇప్పుడు అటువంటి ప్రయత్నమే ప్రియమణి చేస్తోందని వినికిడి. ఎవరే అతగాడుతో పరిచయమై మరుగునపడిపోయిన తనని తిరిగి నిలబెట్టిన మదన్ దర్శకత్వంలో సినిమా చేయటం ద్వారా ఆ ప్రయత్నం చేస్తోందని సమాచారం. ప్రవరాఖ్యుడు టైటిల్ తో నిర్మితమవుతున్న చిత్రానికి నిజానికి ప్రియమణే ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్నఈ చిత్రం నాలుగు రోజులు మినహా టాకీ పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌లో హైదరాబాద్‌లో ఓ సెట్‌లో పాటను చిత్రిస్తారు. ప్రియమణి, జగపతిబాబు, హంసానందినిపై ఆ పాట ఉంటుంది. కల్యాణ్ మాస్టర్ నృత్యరీతుల్ని సమకూరుస్తారు. ఈ నెల 25 నుంచి 30 లోపు ఆ పాటను చిత్రీకరిస్తాం. దాంతో సినిమా మొత్తం పూర్తయినట్టే. నవంబరు మొదటివారంలో పాటల్ని విడుదల చేస్తాం. డిసెంబరు ప్రథమార్ధంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''ని అన్నారు. బ్రహ్మానందం, సునీల్, చలపతిరావు, పూజ, అనితానాథ్ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: కీరవాణి, పాటలు: చైతన్యప్రసాద్.ఇక ఈ చిత్రం ఫేడవుట్ అవుతున్న ప్రియమణికి లైఫ్ ఇస్తుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











