Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రోజుకో కుర్రాడితో..ప్రియమణి
ఫ్యామిలీ టైపు నుంచి బికినీతో రూటు మార్చిన ప్రియమణి తన గమ్మత్తైన గతానుభవాలను గుర్తు చేసుకుంటోంది. కాలేజీలో చదువుకునేటప్పుడు తను రోజుకో కుర్రాడిని ఏడ్పించేదాన్నని అంటోంది. అందులోనూ ఆమె చదివే కాలేజి కో-ఎడ్యుకేషన్ కావటంతో ఆ అవకాశం ఆమెకు వెతుక్కుంటూ వచ్చిందని చెప్తోంది. అయినా కామన్ గా కుర్రాళ్ళు..అమ్మాయిలను ఏడ్పిస్తారు కదా మీరేంటి రివర్స్ లో చెప్తున్నారు అంటే నవ్వి అప్పట్లో టీజింగ్ చేయటంలో తను చేయితిరిగన దాన్నని అంటోంది.
అయినా ప్రియమణి బ్యాచ్ లో ఉన్నవారంతా ప్రేమ ప్రేమ అంటే తాను వాళ పిచ్చి వాళ్ళను పిచ్చివాళ్ళలాగా చూసేదని చెప్తోంది. అంతేగాక ప్రేమిస్తే ఒక్క అబ్బాయితోనే మాట్లాడాలి అదే గనుక ప్రెండ్ షిప్ అయితే రోజుకొకరిని ప్రెండ్ గా ప్రేమించవచ్చు అని విచిత్రమైన వేదాంతం చెప్పేదట. అంటే ఇప్పుడు మీరు ప్రేమ మీద సరైన నిర్ణయానికి వచ్చినట్లేనా అంటే నన్ను ఇరికించవద్దని నవ్వేసింది. అయినా ఆమె కొంత కాలంగా ఓ మళయాళ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రియమణి మణిరత్నం చిత్రంతో బిజీగా ఉంది. ఆమె బాలయ్యతో చేసిన మిత్రుడు త్వరలో రిలీజ్ కానుంది.