చిరంజీవికి హీరోయిన్‌గా ఛాన్స్... ప్రియమణికి కెరీర్‌లోనే రికార్డ్ రెమ్యునరేషన్? ఎన్ని కోట్లంటే?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారుగా సంక్రాంతికి వచ్చి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు మెగాస్టార్ చిరంజీవి. ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో సీనియర్ హీరోలలో ఎవరికీ లేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు చిరు. ఈ సినిమా బాక్ల్ బస్టర్ కావడంతో ఆయన తదుపరి సినిమాలపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల, బాబీలతో చిరంజీవి సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే వీరిలో తనకు వాల్తేర్ వీరయ్య లాంటి హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో తన 158వ సినిమా చేసేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సక్సెస్‌ మోడ్‌లో మెగాస్టార్
మన శంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్‌ను అలాగే కంటిన్యూ చేయాలని చిరు భావిస్తున్నారు. అందుకే తనను అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో? మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకులకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. శంకర వరప్రసాద్ గారుతో చిరంజీవిని వింటేజ్ లుక్‌లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు అనిల్ రావిపూడి. డ్యాన్స్‌లు, ఫైట్స్, కామెడీ టైమింగ్‌తో మళ్లీ పాత చిరంజీవిని చూసిన ఆడియన్స్ థియేటర్‌లలో పండగ చేసుకుంటున్నారు. దానికి ఇప్పుడు వస్తోన్న కలెక్షన్సే నిదర్శనం.

Priyamani s Remuneration for Chiranjeevi s Mega 158 Career High for The Family Man actress

భారీ బడ్జెట్‌తో మెగా 158
తాజాగా మెగా 158లోనూ చిరు మార్క్ గ్రేస్, డ్యాన్స్, కామెడీ దండిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనుంది. అయితే ఈ నిర్మాణ భాగస్వామ్యంలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రస్తుతం పలు భాషల్లో భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో బడ్జెట్, షెడ్యూల్, మార్కెటింగ్ వంటి అంశాలపై కొంత టైం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో మరో సంస్థను నిర్మాణ భాగస్వామిగా తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్ మూవీలో సూపర్‌స్టార్?
మెగా 158కి సంబంధించి సోషల్ మీడియాలో ప్రతినిత్యం ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ సినిమాకు కాకా అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. గెస్ట్ రోల్ మాదిరిగానే కాకుండా.. కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రను మోహన్‌లాల్‌తో చేయించాలని బాబీ భావిస్తున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వీరితో పాటు యంగ్ హీరోయిన్ శ్రీలీల లేదా అనసవ్రా రాజన్‌లు చిరంజీవికి కూతురిగా నటించనున్నారని ఫిలింనగర్ టాక్. 2027 సంక్రాంతికి మెగా 158 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిరంజీవి సరసన ప్రియమణి
ఇదిలాఉండగా.. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ ఎవరు? అనే దానిపై పలువురు ముద్దుగుమ్మల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చివరికి సీనియర్ నటి ప్రియమణి ఫైనల్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రియమణి వయసు, ఇమేజ్.. చిరంజీవి సరసన పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టాలీవుడ్‌కు మూలస్తంభాలైన నలుగురు అగ్రహీరోలలో బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో ఇప్పటికే ప్రియమణి నటించగా.. ఒక్క చిరంజీవి మాత్రం బాకీ ఉన్నారు. ఇప్పుడు మెగా 158తో ఆమెకు ఆ లోటు కూడా తీరిపోనుంది.

సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీ
ఇక ప్రియమణి 40 ఏళ్ల వయసులో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు బుల్లితెరపై జడ్జిగానూ అలరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్‌తో ప్రియమణి బిజీగా ఉన్నారు. తమిళంలో దళపతి విజయ్‌తో కలిసి నటించిన జన నాయగన్‌ రిలీజ్‌ కావాల్సి ఉంది. ఇదికాక కోలీవుడ్‌లోనే జీడీఎన్, తెలుగులో సరస్వతి సినిమాలలో ప్రియమణి నటిస్తున్నారు. ఇలాంటి దశలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం రావడంతో ప్రియమణి గాల్లో తేలిపోతోందట. అంతేకాదు.. ఈ సినిమా కోసం ఆమెకు భారీగా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లుగా ఫిలింనగర్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రియమణికి రికార్డ్ రెమ్యునరేషన్?
ప్రియమణి కెరీర్‌లోనే ఇది అత్యధిక మొత్తంగా తెలుస్తోంది. సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టంగా మారింది. నయనతార, అనుష్క శెట్టి, త్రిష వంటి వారు మాత్రమే చిరు, బాలయ్య, నాగ్, వెంకీ‌లకు ఛాయిస్‌గా మారారు. అందుకే వారు ఎంత డిమాండ్ చేసినా దర్శక నిర్మాతలు ఓకే చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా 158 కోసం ప్రియమణికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఫిలింనగర్ టాక్ ప్రకారం ఆమెకు 1.50 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు పారితోషికంతో పాటు అదనపు సౌకర్యాలు, తన స్టాఫ్ ఖర్చులు కూడా నిర్మాణ సంస్ధే భరించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: priyamani chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X