twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లూసీఫర్‌లో చిరంజీవి చెల్లెలి పాత్రలో ఊహించని హీరోయిన్: రోజా, విజయశాంతి తర్వాత ఈమెనే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు నలభై ఏళ్లుగా తన హవాను చూపిస్తోన్న ఆయన.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను చేరుకున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చారు. కొంత విరామం మరోసారి సినిమాల్లోకి ఎంట్రీ.. అప్పటి నుంచి వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్'ను రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఎంతో ముఖ్యమైన హీరో సోదరి పాత్రకు ఊహించని నటిని ఎంపిక చేశారట. ఆ వివరాలు మీకోసం!

    జిమ్‌లో జాన్వీ కపూర్.. అందానికి పదునుపెడుతున్న యువ హీరోయిన్

    రెండు వచ్చాయి.. విభిన్నమైన ఫలితాలు

    రెండు వచ్చాయి.. విభిన్నమైన ఫలితాలు

    సుదీర్ఘ విరామం అనంతరం మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఆయన మరింత వేగం పెంచి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది 'సైరా: నరిసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ఆశించినంతగా ఆడలేదు.

    ఇప్పుడు మెగా మల్టీస్టారర్‌తో ఫుల్ బిజీగా

    ఇప్పుడు మెగా మల్టీస్టారర్‌తో ఫుల్ బిజీగా

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'సైరా: నరసింహారెడ్డి' నిరాశనే మిగిల్చింది. దీంతో ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు చిరంజీవి. ఇందుకోసం బడా డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

    అక్కడ మోహన్ లాల్.. ఇక్కడ మెగాస్టార్

    అక్కడ మోహన్ లాల్.. ఇక్కడ మెగాస్టార్

    'ఆచార్య' పట్టాలపై ఉండగానే 'లూసీఫర్' రీమేక్‌ను ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా మరో స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌పై దృష్టి పెట్టిన డైరెక్టర్.. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేస్తున్నాడట.

    సీఎంగా ఇద్దరు... ఎవరు ఫిక్స్ అవుతారో

    సీఎంగా ఇద్దరు... ఎవరు ఫిక్స్ అవుతారో

    రాజకీయ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎంతో ఎలివేట్ అయ్యేలా ఉంటుంది. దానికి సమానంగా కథను మలుపుతిప్పే పాత్రలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో యంగ్ సీఎం రోల్ ఒకటి. మాలయాళం టోవినో థామస్ పోషించిన ఈ పాత్రను తెలుగులో సత్యదేవ్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అలాగే, బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ పేరు కూడా బయటకు వచ్చింది.

     చెల్లెలి పాత్ర విషయంలో సస్పెన్స్ అలానే

    చెల్లెలి పాత్ర విషయంలో సస్పెన్స్ అలానే

    లూసీఫర్ మూవీలో మంజు వారియర్ పోషించిన పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది. హుందాగా కనిపించే హీరో సోదరిగా ఆమె నటించారు. తెలుగులో దీన్ని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పోషిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఫైర్ బ్రాండ్ రోజా ఈ క్యారెక్టర్‌ను చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ, దీని విషయంలో ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో సస్పెన్స్‌గా మారింది.

    మంజు వారియర్ పాత్రలో ఊహించని నటి

    మంజు వారియర్ పాత్రలో ఊహించని నటి

    తాజా సమాచారం ప్రకారం.. చిరంజీవి నటిస్తున్న లూసీఫర్ రీమేక్‌లో మంజు వారియర్ పాత్రకు హీరోయిన్ ప్రియమణిని తీసుకున్నారట. ఇప్పటికే దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించగా.. వెంటనే ఓకే చెప్పేసిందని తెలిసింది. విలక్షణ నటనతో జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న ప్రియమణి తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

    English summary
    Priya Vasudev Mani Iyer, known professionally as Priyamani, is an Indian film actress and former model, who works predominately in Telugu, Kannada, Tamil, and Malayalam-language films. She is a recipient of National Film Award for Best Actress and three Filmfare Awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X