»   » ప్రియమణితో డేటింగ్ లోపాల్గోంటున్న ఆహీరో ఎవరూ..!

ప్రియమణితో డేటింగ్ లోపాల్గోంటున్న ఆహీరో ఎవరూ..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇదెంతవరకూ నిజమో కానీ ఈ వార్త ఫిలిం నగర్ లో గుప్పుమంటోంది. నిజానికి ఉదయ్ కిరణ్ దాదాపు సినిమాల్లో అవకాశాల్లేక నటించటం మానేసినంత పనయ్యాకే ప్రియమణి తెలుగు సినిమాల్లోకి ప్రవేశించింది. మరి వీళ్ళిద్దరికీ లింకు ఎలా కుదిరిందో ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థంగా మారింది. వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న మాటకు ఆధారంగా ఉదయ్ కిరణ్ ని ప్రియమణి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తెగపొగిడేస్తోంది. అలా ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన "నువ్వెక్కడుంటే నేనక్కడుంటా" చిత్రం ఆడియో విడుదలకు హాజరైన ప్రియమణి అక్కడ ఉదయ్ కిరణ్ ని పొగడ్తలతో ముంచెత్తింది. ఇది ఆ రూమర్ కి ఆధారంగా మారింది. నిజానిజాలు నిలకడ మీదగానీ తెలియవు కదా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu