మొత్తానికి గ్యాంగ్ లీడర్ పిల్లని కనికరించారు.. ఆ బోల్డ్ క్యారెక్టర్ చేయగలదా?
గత ఏడాది విడుదలైన నాని గ్యాంగ్ లీడర్ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. అయితే కన్నడ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది.
గ్యాంగ్ లీడర్ సినిమాలో హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీకి అవకాశాలు నెమ్మదిగా వస్తున్నాయి. మొదట్లో ఈ భామ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుందనే టాక్ వచ్చింది. అయితే ఆ రూమర్స్ డోస్ పెరగకముందే క్లారిటీ ఇచ్చింది. పాత్ర డిమాండ్ చేస్తే కాస్త గ్లామర్ టచ్ ఇవ్వడానికి ఏ మాత్రం మోహమాటం లేదని చెప్పింది. అలాగే కొన్ని ఫోటోషూట్స్ తో హాట్ గా కనిపించడానికి ఏ మాత్రం సందేహం లేదని క్లారిటీ ఇచ్చింది.

మొత్తానికి ఈ భామకు మరో మంచి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శర్వానంద్ శ్రీకారం సినిమాలో కథానాయికగా నటిస్తున్న ప్రియాంక ఇప్పుడు నితిన్ అందాదున్ రీమేక్ లో కూడా నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
దర్శకుడు మెర్లపాక గాంధీ ఇటీవల హీరోయిన్ విషయంలో ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఆ సినిమాలో పాత్రకు తగ్గట్టు ప్రియాంక అరుళ్ హాట్ గా కనిపిస్తుందా లేదా అనేది సందేహంగా మారింది. గ్యాంగ్ లీడర్ సినిమాలో పద్దతిగా కనిపించిన ఈ ట్రెడిషినల్ పిల్ల నెక్స్ట్ ఎలా కనిపిస్తుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











