సమంత కాదు.. ఆ బ్యూటీతో నాగ చైతన్య రొమాన్స్: ‘బంగార్రాజు’ కోసం అలా డిసైడ్ అయ్యారు
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున - యంగ్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. మూడేళ్ల క్రితం ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్ తీయాలని నాగ్, కల్యాణ్ ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే 'బంగార్రాజు' అనే ప్రాజెక్టుపై వర్క్ మొదలు పెట్టారు. త్వరలోనే దీన్ని పట్టాలెక్కించబోతున్నారు. ఇలాంటి సమయంలో ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
నాగార్జున డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతోన్న 'బంగార్రాజు'లో అక్కినేని నాగ చైతన్య కూడా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందులో అతడి పాత్ర హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు. ఇక, ఈ మధ్య బయటకు వచ్చిన విషయం ప్రకారం.. ఇందులో చైతూ.. నాగార్జునకు తండ్రిగా నటిస్తున్నాడట. ఇక, అతడికి జోడీగా అక్కినేని వారి కోడలు స్టార్ హీరోయిన్ సమంతను తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో చైతన్యకు జోడీగా తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుందని తెలిసింది.

గతంలో 'గ్యాంగ్ లీడర్', 'శ్రీకారం' వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ భామ.. తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే 'బంగార్రాజు'లో నటించేందుకు ఆమెను సంప్రదించగా.. వెంటనే పచ్చజెండా ఊపిందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ.. నాగార్జునకు జోడీగా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. జూలైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని.. వచ్చే సంక్రాంతికి దీన్ని విడుదల చేస్తామని నాగార్జున ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.



Click it and Unblock the Notifications











