SSMB 29 హీరోయిన్, విలన్ ఫిక్స్.. మహేష్ బాబు-రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదుగా..
SSMB 29: సూపర్ స్టార్ మహేశ్‌బాబు - సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ 'ఎస్ఎస్ఎంబి 29'(SSMB29) అనే సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ను ఆఫ్రికా అడవుల్లో చేయబోతున్నారట. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటీ? మీరు కూడా ఓ లూక్కేయండి.
RRR లాంటి గ్లోబల్ హిట్ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం. మహేష్ - రాజమౌళి కాంబో సినిమాపై ఓ రేంజ్ లో ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టు భారీ పూర్తి చేసారని తెలుస్తోంది. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నారు.

అలాగే.. ఈ మూవీ కోసం మహేష్ బాబు తన లుక్ ను మార్చుకోబోతున్నారు. చాలా డిఫెరెంట్ గా కనిపించబోతున్నారట. ఇందుకోసం ఆయన లాంగ్ హెయిర్.. లైట్ గా గడ్డం పెట్టినట్టు ఇటీవల కాలం ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.అలాగే.. ఈ మూవీ 18 శతాబ్దంలో జరిగే కథ అని, పీరియడ్ డ్రామా అని తెలుస్తోంది. తాజాగా ఓ క్రేజీ అప్డేట్ అంటూ.. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ లీడ్ రోల్ లో నటించనున్నట్టు తెలుస్తోంది

ఈ గ్లోబల్ అడ్వెంచర్ త్రిల్లర్ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైరలవుతుంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే.. ఈ క్రేజీ మూవీలో బాలీవుడ్ నటి, ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), విలన్ గా మలయాళ సూపర్ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)లను ఫిక్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.

ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. మూవీ మేకర్స్ ను అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్టులలో ఈ మూవీ ఇప్పటికే గుర్తింపును దక్కించుకోవడం విశేషం. ఈ మూవీకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. అడ్వేంచర్ ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే.. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











