వామ్మో.. వెబ్ సిరీస్‌తో రూ. 2000 వేల కోట్లు నష్టం.. ఇక సమంతనే దిక్కు.. మరి ఏం చేస్తుందో!

స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సినిమాలకు ఓ ఏడాది పాటు బ్రేక్ ఇవ్వనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి సమయంలో ఆమె గురించి మరో వార్త బయటకు వచ్చింది. ఓ వెబ్ సిరీస్ వల్ల ఏకంగా రూ.2000 వేల కోట్లు నష్టం వచ్చిందట. ఇక సమంత ఏం చేస్తుందో అని అంతా అనుకుంటున్నారు. ఏంటి ఇది చదువుతుంటే ఏం అర్థం కావట్లేదా.. అర్థమవ్వాలంటే ఈ పూర్తి కథనం చదివేయండి..

ఓటీటీలు వచ్చాక ఆడియెన్స్ లో సినిమా చూసే విధానం మారిపోయింది. కమర్షియల్ కన్నా కంటెంట్ ఉన్న చిత్రాలు, సిరీస్ లనే ఎక్కువ ఆదరిస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్, లవ్, హారర్.. ఇలా అన్ని జానర్ల సినిమాలను అందిస్తున్నాయి. వీటి కోసం వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. పలు భాషల స్టార్స్ ను ఒకే తెరపైకి తీసుకొస్తున్నాయి. అలానే వందల కోట్ల లాభాలు ఆర్జించాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ కొన్ని సార్లు అవి ఘోరమైన నష్టాలను తెస్తున్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్‌ కూడా అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ సీఈఓ చెప్పారు.

Priyanka Chopra Citadel web series Amazon prime 2000 crore loss

సిటాడెల్ ఫ్లాప్.. :ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన భారీ వెబ్ సిరీసుల్లో 'సిటాడెల్' కూడా ఒకటి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్ రోల్ నటించింది. ఇక్కడ కూడా అది రిలీజైంది. కానీ అది ఆకట్టుకోలేకపోయింది. ఈ సిరీస్ కోసం దాదాపు 250 మిలియన్ డాలర్స్ వరకు ఖర్చు పెట్టారట. ఈ విషయాన్ని అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ తెలిపారు. అంటే భారత కరెన్సీలో రూ.2000 కోట్లు. ఇప్పుడు ఆ పెట్టుబడందా బూడిదలో పోసిన పన్నీరైందని అంటున్నారు.

Priyanka Chopra Citadel web series Amazon prime 2000 crore loss

ఇక సమంత ఏం చేస్తుందో.. :ఈ 'సిడాటెల్' ఇండియన్ వెర్షన్‌ లో హీరోయిన్ సమంత నటిస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. సమంత, వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. దీని షూటింగ్ పూర‍్తైంది. రిలీజ్ కు రెడీ అయింది. అయితే ఒరిజినల్ సిరీస్ డిజాస్టర్ అందుకుంది. మరి సమంత నటించిన 'సిటాడెల్' అయినా హిట్ అయితే అమెజాన్‌కు కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Priyanka Chopra Citadel web series Amazon prime 2000 crore loss

ఏకంగా రూ. 4000 వేల కోట్లు.... ':సిటాడెల్' సిరీస్‌తో పాటు ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన 'ది పవర్', 'డైసీ జోన్స్ అండ్ ది సిక్స్', 'ది ఫెరిఫెరల్', 'డెడ్ రింగర్స్' లాంటి షోలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' కోసం ఏకంగా రూ.4000 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఈఓ ఆండీ జెస్సీ తెలిపారు. అది కూడా ఫ్లాప్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X