SSMB 29: రాజమౌళి- మహేష్ బాబు సినిమాకు ప్రియాంక చోప్రా భారీ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?
Priyanka Chopra: దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో లో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతోంది.. ఈ మూవీకి ఇంకా పేరు పెట్టకపోయినా.. SSMB 29గా ఫేమస్ అయిపోయింది. RRR సక్సెస్ తరువాత గ్లోబల్ స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించేందుకు జక్కన్న సిద్దమయ్యారు. అడ్వెంజర్ త్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ సరసన ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ఎంత రెమ్యూనరేషన్ అందుకోబోతుంది? ఈ గ్లోబల్ సినిమాకు హాలీవుడ్ భామ ఎన్ని కోట్లు తీసుకోబోతున్నారనే వివరాల్లోకి వెళితే..
భారతీయ సినిమా చరిత్రలో కనివిని ఎరుగని విధంగా మూవీ లవర్స్ కొత్త సినిమా ప్రపంచాన్ని, సరికొత్త అనుభూతి అందించేందుకు సిద్దమయ్యారు రాజమౌళి. ఇప్పటి వరకూ ప్యాన్ ఇండియా మూవీస్‌కే పరిమితమైన దర్శక ధీరుడు ఈ సారి ప్రపంచ స్థాయి సినిమాను అందించే ప్రయత్నం చేస్తున్నారట. ఈ భారీ బడ్జెట్ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం దాదాపు 1000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు సమాచారం. మహేష్ బాబు కెరీర్‌లో 29వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తున్నది.

సాధారణంగానే రాజమౌళి మూవీ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబో మూవీ అంటే.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ తన లూక్‌ని మార్చేశారు. పొడవాటి జుట్టుతో జుంపాలు పెంచుకుని.. చాలా హాండ్‌సమ్‌గా హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నారు. ఈ గ్లోబల్ మూవీ కోసం యావత్తు సినీ ప్రపంచం ఎదురు చూస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ పాన్ వరల్డ్ మూవీ పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ అడ్వెంచర్ స్టోరీలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా దాదాపు కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది.ఈ సినిమా కోసం ఆమె హైదరాబాద్ లో కూడా లాండ్ అయ్యింది. అయితే ప్రియాంక కేవలం లుక్ టెస్ట్ కోసం ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ తరుణంలో మహేష్ బాబు సినిమాలో నటించినందుకు ప్రియాంక చోప్రా ఎంత రెమ్యునరేషన్ తీసుకబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్ లతో బిజీబిజీగా ఉన్న ప్రియాంక చోప్రా(Priyanka Chopra).. అక్కడ ఒక్క ప్రాజెక్ట్ కు 45 కోట్ల వరకూ తీసుకుంటుందట. ఆ విధంగా చూస్తే.. ఈసినిమాకు పక్కాగా ఆమెకు 80 కోట్ల ముట్టచెప్పాల్సిందే. కానీ, ఈ సినిమా కోసం రాజమౌళి మాత్రం 25- 30 కోట్ల వరకే ఆఫర్ చేశారట. అలాగే..బల్క్ గా రెండేళ్ళు డేట్స్ అడిగాడట. మరి ఈ రెమ్యూనరేషన్ కు ప్రియాంక ఒప్పుకుంటారో లేదో అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. బాలీవుడ్ నటి అయిన ఆమె.. హాలీవుడ్ పాప్ స్టార్ నిక్ జోనస్ ను పెళ్ళి చేసుకుని లాస్ ఏంజిల్స్ లో ఉంటోంది.
ఇదెలా ఉంటే... ఇక SSMB29 సినిమా షూటింగ్ ఆఫ్రికా సహా ప్రపంచంలోని పలు దేశాలలో షూటింగ్ చేయబోతున్నారంట. ఈ సినిమాలో మళయాల స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే.. ఈ సినిమాను రెండు పార్ట్స్‌లో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్ట్ 1 2027లో, పార్ట్ 2 -2029లో రాబోతున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











