రామ్ చరణ్ 'జంజీర్' పై అది రూమరేనని తేల్చారు
రామ్ చరణ్ తాజా చిత్రం 'జంజీర్' రీమేక్ కి అందులో హీరోయిన్ ప్రియాంక చోప్రాకు తొమ్మిది కోట్లు రెమ్యునేషన్ అనే ప్రచారం జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అది నిజం కాదని,కేవలం రూమర్ అని బాలీవుడ్ మీడియా కొట్టిపారేస్తోంది. ఆమెకు కేవలం ..రూ. 5.5 కోట్లు మాత్రమే ముడుతున్నాయని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా, ఆమె శ్రేయాభిలాషులు కలిసి ఈ రూమర్ ని స్ప్రెడ్ చేసారని,ఆమె డిమాండ్ రేటు ని హైక్ చేయటానికే ఈ వదంతి వ్యాపింప చేసారని తెలుస్తోంది.
ఇక అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకకు రూ. 9 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లూ, దీనితో బాలీవుడ్‌లో కరీనా కపూర్, కత్రినా కైఫ్‌లను దాటిపోయి ప్రియాంక టాప్ రెమ్యునేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా మారినట్లూ విపరీత ప్రచారం జరిగింది. కొన్ని వర్గాలైతే మరో ముందడుగు వేసి రాంచరణ్ కంటే కూడా ప్రియాంకకు ఎక్కువ పారితోషికం అందుతున్నదని కూడా ప్రచారం చేశాయి. దీనిపై ఇటు ప్రియాంక గానీ, అటు నిర్మాత అమిత్ మెహ్రా గానీ ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. అయితే ఈ ప్రచారం అబద్దమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కావాలని ప్రియాంక శ్రేయోభిలాషులు ఈ రకమైన ప్రచారానికి పాల్పడుతున్నారనేది వాళ్ల ఆరోపిస్తున్నారు.
ఇక జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్ ..విజయ్ గా కనిపించనున్నాడు..మాలా గా ప్రియాంక చోప్రా,తేజ గా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఇక షేర్ ఖాన్ పాత్రలో అర్జున్ రాంపాల్,మోనా గా మహీ గిల్ కనిపించి అలరించనున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.
ఈ చిత్రంలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్ మెహ్రా నిర్మాత. ఈ రీమేక్‌లో అమితాబ్ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్ సమాచారం. ఈ విషయమై దర్శకుడు అపూర్వ లఖియా ని మీడియా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు.


Click it and Unblock the Notifications











