మణిరత్నం సినిమాలో మహేష్ సరసన ఆమెనే బుక్ చేస్తున్నారు
మహేష్, మణిరత్నం కాంబినేషన్ లో చేయబోయే వీరుడు చిత్రం రోజుకో విశేషంతో ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలివుడ్ సెక్సీ హీరోయిన్ ప్రియాంక చోప్రాను ఎంపికచేస్తునట్లు వార్తలు వస్తున్నాయి. ఒకప్పటి మిస్ వరల్డ్ అయిన ఆమె కూడా ఎప్పటి నుంచో తెలుగలో ఒక మంచి సినిమా చేయాలని అవకాశమున్నప్పుడల్లా మీడియా ముందు ఊదరకొడుతోంది. ఈ మేరకు ఆమెను సంప్రదించారని, అయితే ఆమె తన షూటింగ్ బిజీలో ఉండటంతో ఏ విషయం చెప్పలేదని, అయితే మణిరత్నంతో తాను పనిచేయటానకి ఆసక్తి చూపుతున్నట్లు చెప్పింది.
ఈ చిత్రాన్ని రజనీకాంత్ తో 'రోబో" చిత్రాన్ని నిర్మించి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన సన్ పిక్చర్స్ తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. ఇందుకోసం అమర్ కల్కి రచించిన 'పొన్ని యన్ సెల్వన్" అనే నవలను సన్ పిక్చర్స్ ఎంచుకుంది. ఐదు సంపుటాల నవలను కేవలం 80 సీన్లతో మణిరత్నం చక్కని స్క్రిప్ట్‌గా మలిచారని సమాచారం.ఇక ప్రస్తుతం మహేష్..శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.మహేష్ సరసన తొలిసారిగా సమంత కనిపించనుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆచంట గోపీచంద్, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.


Click it and Unblock the Notifications











