Priyanka Chopra: ‘వారణాసి' కోసం కోసం ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
Priyanka Chopra Remuneration: సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ మూవీ 'వారణాసి' (Varanasi). ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మీ సిటీలో గ్రాండ్‌గా నిర్వహించిన టైటిల్ రిలీజ్ ఈవెంట్ తర్వాత, ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఈ తరుణంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా పారితోషికం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ప్రియాంక చోప్రా ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది?
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా 'వారణాసి' పై మొదటి రోజు నుంచే విపరీతమైన హైప్ నెలకొంది. ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండటంతో ప్రాజెక్ట్ రేంజ్ మరింత పెరిగింది. విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన వారణాసి గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. రాజమౌళి తీసిన గ్రాండ్ విజువల్స్, మహేష్ బాబు కనిపించిన నూతన అవతారం అభిమానుల్లో హైప్స్ క్రియేట్ చేశాయి. ఇక మూవీలో ప్రియాంక మందాకిని అనే ప్రధాన పాత్రలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రియాంక చోప్రా ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ హట్ టాపిక్ గా మారింది. ఇటీవల వరుసగా పలు మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు ప్రకారం.. ప్రియాంక చోప్రా 'వారణాసి' కోసం సుమారు రూ. 30 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించనప్పటికీ, ఎటువంటి స్పష్టత ఇవ్వకపోయినా, అభిమానుల్లో భారీ చర్చ జరుగుతోంది.నిజంగా ఇంత మొత్తంలో పారితోషికం తీసుకుంటే.. ప్రియాంక దేశంలో అత్యధిక పారితోషికం అందుకోబోయే నటిగా రికార్డు క్రియేట్ చేస్తుంది. బాలీవుడ్ లో ముఖ్యంగా దీపికా పదుకొణే, అలియా భట్ వంటి అగ్రహీరోయిన్స్ రూ. 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటారట.ఈ తరుణంలో ప్రియాంక చోప్రా పారితోషికం చర్చనీయంగా మారింది.
ఇక హీరో మహేశ్ బాబు విషయానికి వస్తే.. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబు పారితోషికం తీసుకోవడం లేదు, బదులుగా ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిసింది. ఇది హాలీవుడ్ స్టార్‌ల తరహాలో రాజమౌళి రూపొందించిన కొత్త బిజినెస్ మోడల్‌గా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇక వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ కోసం నిర్మాతలు సుమారు రూ. 18-20 కోట్లు ఖర్చు చేశారట. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ఈ ఈవెంట్‌కు అత్యాధునిక విజువల్స్, వంద అడుగుల భారీ LED స్క్రీన్స్, అద్భుతమైన AR-VR ప్రెజెంటేషన్లు ఉపయోగించినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందో చూపించేలా ఈ ఈవెంట్‌ను ఇంటర్నేషనల్ మీడియాకు ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు సమాచారం.
రాజమౌళి, మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ముగ్గురూ ఇప్పటికే అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రపంచ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ పాన్-వరల్డ్ లెవల్లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుండటం మరో విశేషం. ఇలా రాజమౌళి- మహేష్ బాబు కాంబో లో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా సంబంధించిన చిన్న అంశమైన నెట్టింట్లో చర్చనీయంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌కు భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించనున్నట్లు అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











