ప్రియాంక చోప్రా రికార్డు రెమ్యునరేషన్.. వారణాసికి ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ'వారణాసి'(Varanasi). ఈ కాంబో ప్రకటించిన నాటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ పాన్ వర్డల్ వైడ్ గా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మెగా ఎపిక్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ రేంజ్‌ మరింత పెరిగింది. అయితే.. తాజాగా ప్రియాంక పారితోషికం గురించి వెలువడుతున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ వారణాసి మూవీ కోసం ప్రియాంక చోప్రా ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందంటే?

రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ వారణాసి. ఈ సినిమాపై రోజురోజుకు విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఈ మూవీలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వారణాసి'లో మహేశ్ బాబు 'రుద్ర' పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక 'మందాకిని' పాత్ర పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. 2000 BC నుంచి 2027 వరకూ విస్తరించిన టైమ్‌లైన్‌తో ఈ కథ సాగుతుందనే సమాచారం ఉంది.

Priyanka Chopra s Rs 30 Crore Remuneration for SS Rajamouli Mahesh Babu s Varanasi

ప్రియాంక చోప్రా దాదాపు ఆరేండ్ల తర్వాత పూర్తి స్థాయి వారణాసిలో నటిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని ప్రముఖ టాక్ షో 'ది టునైట్ షో స్టారింగ్ జిమ్మీ ఫాలన్'లో ప్రియాంక పాల్గొన్నారు. ఈ సమయంలో ఆమె 'వారణాసి' మూవీ గురించి మాట్లాడి గ్లోబల్ హైప్ పెంచారు. 'రాజమౌళి ఇండియాలో అత్యంత విజనరీ డైరెక్టర్ అనీ, వారణాసి మూవీ భారీ అడ్వెంచర్ ఎపిక్' అంటూ ప్రశంసలు కురిపించింది. ఆమె చేసిన కామెంట్స్ తో ఈ సినిమా గురించి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీశాయి.

ఇక వారణాసి ఇప్పటికే 14 నెలలుగా షూటింగ్ జరుగుతుండగా, మొత్తం 6-8 నెలలపాటు ప్రొడక్షన్ పనులు జరుగునున్నట్టు సమాచారం. IMAX ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ గ్రాండియర్‌కు నిదర్శనంగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో మహేశ్ బాబు రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. హాలీవుడ్ తరహా బిజినెస్ మోడల్‌ను రాజమౌళి అమలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

రూ.30 కోట్ల రెమ్యునరేషన్?
సినీ వర్గాల సమాచారం ప్రకారం..'వారణాసి' కోసం ప్రియాంక చోప్రా దాదాపు రూ.30 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చకు దారి తీసింది. ఒకవేళ రెమ్యూనరేషన్ నిజమైతే, ప్రస్తుతానికి భారతీయ సినిమాల్లో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌గా ప్రియాంక రికార్డు సృష్టించినట్టే.

ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లు సాధారణంగా రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో రూ.30 కోట్లు అంటే అత్యంత భారీ రెమ్యూనరేషన్ అనే చెప్పాలి. గ్లోబల్ మార్కెట్, అంతర్జాతీయ క్రేజ్, హాలీవుడ్ ఇమేజ్ అన్ని కలిపి ఈ స్థాయి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం కరెక్టేనని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X