మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు

వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇటీవలి కాలంలో 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటుతోన్న అతడు.. ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలోనే దాని కంటే ముందే మరో సినిమా కూడా చేయబోతున్నాడని, అది కూడా ఫిక్స్ అయిందని ఇటీవల ఓ న్యూస్ వైరల్ అయింది.

రాజమౌళితో సినిమా కంటే ముందు మహేశ్ బాబు మరో సినిమా చేయబోతున్నాడట. ఇందుకోసం వంశీ పైడిపల్లి, వెంకీ కుడుములతో కథా చర్చలు కూడా జరిపాడు. ఇక, ఇటీవలే గతంలో 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ అందించిన అనిల్ రావిపూడితో మంతనాలు జరిపాడు మహేశ్. ఈ సందర్భంగా అతడు ఓ క్రికెట్ నేపథ్యంతో సాగే ఓ కథను కూడా వినిపించాడట. యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతో ఈ చిత్రంలో నటించేందుకు సూపర్ స్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

Priyanka Mohan Fix for Mahesh Babu - Anil Ravipudi Movie

అనిల్ రావిపూడి - మహేశ్ బాబు కాంబోపై ఎటువంటి ప్రకటన వెలువడకపోయినప్పటికీ.. ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ (గ్యాంగ్ లీడర్ ఫేం)ను తీసుకున్నారని ఓ న్యూస్ తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. శర్వానంద్ నటించిన 'శ్రీకారం' ద్వారా త్వరలోనే ప్రేక్షకులన పలకరించబోతున్న ఈ అమ్మడికి తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్ వచ్చేసింది. ఈ కారణంగానే రాబోయే సినిమాలో ఆమెకు అవకాశం కల్పించారట అనిల్.. మహేశ్. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X