ప్లాప్ ఎఫెక్ట్: నిర్మాత జంప్, సాయి ధరమ్ తేజ్ న్యూ ఫిల్మ్ క్యాన్సిల్?

By Bojja Kumar

Recommended Video

సాయి ధరమ్ తేజ్ న్యూ ఫిల్మ్ క్యాన్సిల్?

వరుస ప్లాపులతో ఇప్పటికే పీకల్లోతు మునిగిన సాయి ధరమ్ తేజ్‌ను 'ఇంటిలిజెంట్' సినిమాతో మరింత లోతుకు మునిగిపోయాడు. ఈ సినిమా ప్లాపు దెబ్బకు తేజ్‌తో మరో సినిమా కమిటైన ఓ నిర్మాత.... తెలివిగా జంప్ అయినట్లు తాజాగా ఫిల్మ్ నగర్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీంతో ఈ సినిమా క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలో ఉందని చర్చించుకుంటున్నారు.

సాయి ధరమ్ తేజ- గోపీచంద్ మలినేని

సాయి ధరమ్ తేజ- గోపీచంద్ మలినేని

సాయి ధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. అయితే ఈ సినిమాను నిర్మించడానికి గతంలో సుముఖత చూపిన నిర్మాత.... ‘ఇంటిలిజెంట్' పెద్ద ప్లాప్ కావడంతో చేయడం ఇష్టం లేక తప్పుకున్నట్లు సమాచారం.

ఇంటిలిజెంట్ భారీ లాస్

ఇంటిలిజెంట్ భారీ లాస్

సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే ఇంటిలిజెంట్ చిత్రం అతిపెద్ద లాస్. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం కనీసం 20 శాతం కూడా రికవరీ చేయలేక పోయింది. మెగా ఇమేజ్ ఉన్న హీరో, వివి వినాయక్ లాంటి పెద్ద దర్శకుడు అని ఎంతో మంది నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ నమ్మకమే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లను నిలువునా ముంచేసింది.

 సినిమా డౌటే

సినిమా డౌటే

సాయి ధరమ్ తేజ్‌తో చేయబోయే సినిమా కోసం చాలా కాలంగా కసరత్తు చేస్తున్న గోపీచంద్ మలినేని..... నిర్మాత హ్యాండివ్వడంతో మరో నిర్మాత కోసం వెతుకుతున్నాడట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ సాయి ధరమ్ తేజ్, గోపీచంద్ మలినేని చిత్రం చేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

కరుణాకరన్ మూవీ చేస్తున్న తేజ్

కరుణాకరన్ మూవీ చేస్తున్న తేజ్

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టెనర్స్ తెరకెక్కించడంలో స్పెషలిస్టుగా పేరుగాంచిన కరుణాకరన్...... సాయి ధరమ్ తేజ్‌‌ను ఇప్పటి వరకు వచ్చిన రొటీన్ సినిమాలకు భిన్నంగా చూపిస్తాడని అంతా నమ్ముతున్నారు. దీంతో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా సాయి ధరమ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X