హీరో సిద్దార్థ క్షమాపణలు వెనుక దిల్ రాజు హస్తం...!
180 సినిమా బాలేదంటూ విడుదలకి ముందే ఓ ఛానెల్ కార్యక్రమం ప్రసారం చేసే సరికి ఒళ్లు మండిపోయిన సిద్దార్థ్ విచక్షణ మరిచిపోయి జర్నలిస్టులపై దారుణమైన కామెంట్స్ వేశాడు. వాళ్ల కుంటుంబాల్ని కూడా విమర్శిస్తూ సిద్దూ చేసిన కామెంట్స్ జర్నలిస్టుల ఆగ్రహాన్ని చవిచూశాయి. అప్పటి నుండి సిద్ధార్థ్ ని ఎలక్ట్రానిక్ మీడియా బహిష్కరించిది. అతను ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండా మైకులు, కెమెరాలు తీసుకొని వాకౌట్ చేసిన విషయం విధితమే.
అప్పటి నుండి అతని వ్యవహారాల గురించి కానీ, సినిమాల గురించి కానీ ఎక్కడా కవరేజ్ లేదు. అయినా కానీ తనకి పోయేదేమీ లేదని భీష్మించుకుని కూర్చున్న సిద్దార్త్ ఎట్టకేలకు మీడియా వారికి క్షమాపణలు చెప్పేసాడు అయితే ఈ క్షమాపణల వెనుక నిర్మాత దిల్ రాజు హస్తం ఉన్నట్టు ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి.
అందుకు కారణమూ లేకపోలేదు.. త్వరలో సిద్దార్త్ దిల్ రాజు నిర్మించిన ఓ మై ఫ్రెండ్ సినిమా విడుదల సమీపిస్తుండటంతో మీడియా సపోర్ట్ లేకపోతే చాలా కష్టమని భావించిన దిల్ రాజు సిద్దార్థ పై ప్రెజర్ చేసి ఈ సారి చెప్పించాడని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్...దీని వెనుక ఎంత నిజం ఉందో తెలియదు కానీ మీడియా అంటే ఇతగాడికి ఉన్న చిన్న చూపు ఈ ఒక్క క్షమాపణతో పోయిందని అనుకోలేం...


Click it and Unblock the Notifications











