బెల్లంకొండ సురేష్ ఆత్మహత్య ప్రయత్నం...ఖండన
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆత్మహత్యా ప్రయత్నం అంటూ ఎస్ ఎమ్ ఎస్ లు ఫిల్మ్ సర్కిల్స్ లో మీడియా వ్యక్తుల మధ్య సర్కులేట్ అయ్యాయి. అంతేకాకుండా మీడియాలోనూ వార్తలు వచ్చాయి. బెల్లంకొండ 25 కోట్ల రూపాయలు లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మల్టి డైమన్షన్ వారికి ఇవ్వాలని, వారు ప్రెజర్ చేయటంతో ఆయన ఆ ప్రయత్నం చేసారని వాటి సారాంశం. అయితే ఈ విషయాన్ని ఆయన ఖండించారు. అలాంటి రూమర్స్ ని నమ్మవద్దని అన్నారు. ఆయన తాను లారెన్స్ చిత్రం ముని పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా చెన్నైలో ఉన్నానని చెప్పారు.
'రభస' రిలీజ్ కు ముందు సైతం ఫైనాన్స్ కు సంబంధించిన వివాదంలో మంచు లక్ష్మి, బెల్లంకొండ సురేష్ పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. బెల్లంకొండ సురేష్ తమకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వలేదని ఆయన ఇంటివద్ద మంచు లక్ష్మికి చెందిన వ్యక్తులు ధర్నా చేసిన సంగతి తెలిసిందే.

మంచు లక్ష్మి నిర్మించిన ఊ కొడతారా...ఉలిక్కి పడతారా చిత్రం గంధర్వ మహల్ సెట్ ని నిర్మాత బెల్లంకొండ సురేష్ రభస చిత్రం కోసం అద్దెకు తీసుకున్నారు. ఇందు నిమిత్తం 58 లక్షల రూపాయలు ఇస్తానని మంచు లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒప్పుకున్న పేమెంట్ ఇవ్వకపోవటంతో మంచు లక్ష్మి అనుచురులు ఇలా ధర్నాకు దిగారు. డబ్బులు ఇచ్చే వరకు 'రభస' సినిమా విడుదల కానివ్వమని ఆందోళనకు దిగారు. అయితే చివరి నిముషంలో సెటిల్ మెంట్ చేసుకుని విడుదల చేసారు.
మరో ప్రక్క అల్లుడు శీను చిత్రం నష్టాలు మిగిల్చాయని, తర్వాత వచ్చిన రభస సైతం రసాభాస గా మారటంతో బెల్లంకొండ ఆర్దికంగా బాగా దెబ్బ తిన్నాడని అంటున్నారు. ఫైనాన్స్ లు, డిస్ట్రిబ్యూటర్స్ కు కట్టాల్సిన డబ్బు చాలా ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











