ఈ స్ధితికి కారణం పవన్, మహేష్ అంటూ నిర్మాత మండిపడ్డారా
తెలుగు సినీ పరిరక్షణకు మహేష్,పవన్ లతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం తీసుకున్నాక ఆ సమావేశంలో పాల్గొన్న నిర్మాత సి.కళ్యాణ్..మహేష్, పవన్ కళ్యాణ్ లను అస్సలు ఇలాంటి పరిస్ధితి రావటానికి కారణమన్నట్లు తేల్చినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం భారీ ప్లాప్ లకుగా నమోదు అయిన ఖలేజా, పులి రెండు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహించిన సి.కళ్యాణ్ ఈ మాట అనటం సబబే అని సిని వర్గాలు అంటున్నాయి.
వీరి సినిమాలు ఎక్కువ కాలం లేటవటం, అనుకున్న బడ్జెట్ లకు మూడు నాలుగు రెట్లు పెరగటమే పరిశ్రమ ఇబ్బందుల్లో పడటానికి ఒక కారణమని ఆయన ఆరోపించినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణతో పరమవీర చక్ర చిత్రం నిర్మిస్తున్న కళ్యాణ్ మాటలు నిజమే అనిపించినా బహిరంగంగా ఈ విషయంలో ఆయనకు మద్దతు తెలిపే సాహసం ఎవరూ చేయలేరని, పెద్ద హీరోలను ఎదిరించి ఇక్కడ మనుగడ సాగించటం కష్టమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











