ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి అప్పు...40 కోట్లా !?
గోల్డెన్ హ్యాండ్ గా పరిశ్రమలో పేరుతెచ్చుకున్న దిల్ రాజు దాదాపు నలభై కోట్ల వరకూ అప్పు ఉందని పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతుంది. వరసగా సినిమాలు ఫెయిల్యూర్ కావటమే కాక డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న చిత్రాలు సైతం భాక్సాఫీస్ వద్ద కుదేలవటానికి ఉదాహరణగా చూపెడుతున్నారు. అంతేగాక ఆయన ఇష్యూ చేసిన చెక్ లు ఎన్నడూ లేని విధంగా బౌన్స్ అవుతున్నాయని తెలుస్తోంది. ఇక తాజాగా ఆయన ప్రభాస్ హీరోగా చేసిన డార్లింగ్ చిత్రం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. అదీ ఆయనకు నిద్రలేని రాత్రిళ్ళనే మిగులిస్తోందని అంటున్నారు. లాభం రాకపోయినా..నష్టం రాకుండా ఉంటే చాలని భావిస్తున్నారు. ఇక దిల్ రాజు ప్రస్తుతం రామ రామ కృష్ణ కృష్ణ చిత్రానికి 16 కోట్లు, బృందావనం...35 కోట్లు, ప్రభాస్, దశరధ్ కాంబినేషన్ లో ప్రాజెక్టుకి 15 కోట్లు ఇన్వెస్ట్ చేసారు. దాదాపు అరవై, డబ్బై కోట్లు గల ఈ మొత్తం వెనక్కి తిరిగి రావాలంటే చిత్రాలు పూర్తయి అమ్ముడవ్వాలి. ఈ మొత్తాల్లో చాలా భాగం బయిటనుంచి తెచ్చినవేనని అందుకే నలభై కోట్ల వరకూ అప్పుల్లో ఉన్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











